మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ.. తన భర్త కళ్యాణ్ దేవ్ నుంచి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు బాగా వైరల్ అయ్యాయి.. కానీ ఎటువంటి అధికారిక ప్రకటన వెలబడలేదు. అయితే వీరిద్దరికి పుట్టిన పాప మాత్రం కొన్ని రోజులు కళ్యాణ్ దేవ్ దగ్గర ,మరికొన్ని రోజులు శ్రీజ దగ్గర గడుపుతూ ఉంటుంది.
అయితే పాపకు తల్లిదండ్రులు ఇద్దరూ అవసరమని ఎప్పుడు తెలుసుకుంటారని అభిమానుల సైతం ఎంతో ఎదురు చూశారు. ఈ తరుణంలోనే.. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఇన్ స్టా పోస్ట్ వైరల్ గా మారింది. ‘కొన్ని విషయాలు మన నియంత్రణలో ఉండవు. అప్పుడు పరిస్థితిలో మనకు వ్యతిరేకంగా మారి హృదయం గాయపడుతుంది. లైఫ్ లో ఎన్ని కష్టాలు వచ్చినా, పరిస్థితి చేజారిన ఒక్కసారి కళ్ళు మూసుకొని నిర్మలమైన అంతర్గత ప్రపంచానికి మళ్ళీ కనెక్ట్ అవ్వండి. అన్ని దారిలోకి వస్తాయి’ అని రాసుకొచ్చారు. ఈ పోస్టుకు మాత్రం ఆమె కామెంట్లను డిజేబుల్ చేశారు.