కుత్బుల్లాపూర్‌లో కూన వన్‌మ్యాన్ షో..వార్ వన్‌సైడ్.!

-

కూన శ్రీశైలం గౌడ్.. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు.. మూడు దశాబ్దాలుగా రంగారెడ్డి-గ్రేటర్ హైదరాబాద్ పోలిటికల్ సర్కిల్‌లో మంచి ప్రజా నాయకుడు అని వినిపిస్తున్న పేరు. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజల్లో ఉండే నేత. రాజకీయ పార్టీల్లో చేరి నాయకులుగా ఎదిగిన వారు ఉంటారు… కానీ ఈయన సొంత బలంతో ఎదుగుతూ..విజయం సాధించిన నేత. ఉమ్మడి ఏపీ కాంగ్రెస్  పార్టీలో కీలక నేతగా పనిచేస్తూ వచ్చారు. కాంగ్రెస్ లో అనేక కీలక పదవులు చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఇక ప్రజలకు సేవచేయాలంటే ప్రజాప్రతినిధిగా గెలవాలని చెప్పి 2009 ఎన్నికల బరిలో కాంగ్రెస్ తరుపున పోటీ చేయడానికి ప్రయత్నించారు. కానీ అనూహ్య కారణాలతో కూనకు సీటు ఇవ్వకుండా కే‌ఎం ప్రతాప్‌కు సీటు ఇచ్చారు. దీంతో ప్రజా నాయకుడుగా ఉన్న కూన ఇండిపెండెంట్ గా బరిలో దిగారు. ఇండిపెండెంట్ గా ఆయనేమీ గెలుస్తారని అంతా అనుకున్నారు. కానీ కుత్బుల్లాపూర్ ప్రజలు… తమలో ఒకడిగా ఉన్న కూన వైపే నిలిచారు. దాదాపు 23 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారు. అంటే కూన శ్రీశైలంకు ప్రజా మద్ధతు ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈయన కెపాసిటీకి అప్పుడు అధికారంలోకి వచ్చిన వైఎస్సార్.. మళ్ళీ కూనని కాంగ్రెస్ లోకి తీసుకొచ్చారు.

అప్పుడు ఎమ్మెల్యేగా కూన కుత్బుల్లాపూర్‌ని అభివృద్ధి బాటలో పయనించేలా చేశారు. గ్రేటర్ సర్కిల్‌లో కుత్బుల్లాపూర్ మారుమ్రోగేలా చేశారు. ఇండస్ట్రీయల్ ప్రాంతంగా ఎదగడానికి కృషి చేశారు. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ.. వారి సమస్యలని పరిష్కరిస్తూ.. తాగునీరు సౌకర్యం, డ్రైనేజ్ వ్యవస్థ అభివృద్ధి, రోడ్లు, కమ్యూనిటీ హళ్ళు, స్కూల్స్.. ఇలా ప్రజలకు అవసరమైన ప్రతిదీ సమకూర్చారు. నగరానికి కాస్త దూరంగా ఉండే ఈ ప్రాంతం.. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో కలిసి అన్నీ సదుపాయాలు ఉండే ప్రాంతంగా కుత్బుల్లాపూర్ ఎదగడంలో కూన చేసిన కృషి గురించి ఎంత చెప్పిన తక్కువే.

అందుకే ప్రజలు ఈ సారి కూన శ్రీశైలంని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించి తమ ప్రాంతాన్ని మరింత అభివృద్ది చేసుకునేలా.. అవినీతి లేని పాలన తెచ్చుకోవాలని చేస్తున్నారు. అయితే 2009లో గెలిచినా.. 2014, 2018 ఎన్నికల్లో కూన శ్రీశైలంకు ఓటమి వచ్చింది. అయినా సరే కూన కుత్బుల్లాపూర్‌ని వదలలేదు.అక్కడే ఉన్నారు.. ప్రజలతోనే ఉన్నారు. తనని ఓడించినా సరే ప్రజల సమస్యలపై పోరాడుతూనే ఉన్నారు.

పార్టీ వేదిక మారింది గాని.. ఆయన పోరాటం మారలేదు. బీజేపీని బలోపేతం చేస్తూ.. కుత్బుల్లాపూర్‌ని కమలం కంచుకోటగా మార్చే దిశగా తీసుకెళుతున్నారు. సాధారణంగా కుత్బుల్లాపూర్ లో కమలంకి పట్టు తక్కువ.  కానీ కూన రాకతో కుత్బుల్లాపూర్ లో కమలం జెండా ఎగిరే సమయం దగ్గరపడింది.

రెండుసార్లు గెలిచి అధికార పార్టీ ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్‌కు చేసిందేమీ లేదని, అవినీతి, కబ్జాలు, అక్రమాలు పెరిగాయని, అభివృద్ధి దూరమైందని, కావాల్సిన వాళ్ళకే పనులు, పథకాలు అన్నట్లు పాలన నడుస్తుందని సామాన్య ప్రజలు విసిగెత్తిపోయి ఉన్నారు. ఈ తరుణంలో మరోసారి కూనని గెలిపిస్తే కుత్బుల్లాపూర్ లో పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు అని, సకల సౌకర్యాలు సమకూరుతాయని భావిస్తున్నారు. అధికార బలంతో దాడులు చేసినా సరే ప్రజల కోసం తట్టుకుని నిలబడి.. ప్రజాక్షేత్రంలోనే అధికార మదం దించేసి.. ప్రజా విజయం అందుకోవడానికి కూన దగ్గరలోనే ఉన్నారని ప్రజలు భావిస్తున్నారు. ఏదేమైనా కుత్బుల్లాపూర్‌లో కూన్ వన్ మ్యాన్ షో నడుస్తుందని.. వార్ వన్‌సైడ్ అవ్వడం ఖాయమని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news