RRR నుంచి మరో సర్ ప్రైజ్… విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తారు…

టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ RRR. ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. తాజాగా RRR మూవీ టీం అభిమానులకు ఓ సర్ ప్రైజ్ ను రిలీజ్ చేసింది. ఈ సర్ ప్రైజ్ తో టాలీవుడ్ లోని రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫుల్లు జోష్ గా ఉన్నారు. ఇంతకీ విషయం ఏంటంటే…..

RRRMovie

RRR సినిమా షూటింగ్ పార్ట్ పూర్తయిందని ఆ టీం తాజాగా ట్వీట్ చేసింది. అంతే కాకుండా ఈ మూవీకి సంబంధించి రెండు భాషల్లో రామ్ చరణ్ , తారక్ ఇరువురూ తమ డబ్బింగ్ కూడా పూర్తి చేశారట. ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. RRR టీం ఇచ్చిన ఈ సర్ ప్రైజ్ గిఫ్ట్ తో అభిమానుల్లో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారట. ఈ రెండు విషయాలతో పాటు RRR టీం మరో విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంది.

కాగా ఈ సినిమాను ముందుగా అనుకున్నట్లుగా అక్టోబర్ 13నే ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని చెప్పింది. అంతే కాకుండా రామ్ చరన్ జూనియర్ ఎన్టీఆర్ బుల్లెట్ బండి పోతున్న ఓ ఫొటోను కూడా షేర్ చేసింది. ఈ మూవీలో రామ్ చరణ్ మన్యం దొర అల్లూరి సీతారామరాజు పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇరువురి జన్మదినాలను పురస్కరించుకుని విడుదల చేసిన మూవీ ట్రైలర్లకు అభిమానుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రంలో హాలీవుడ్ ముద్దుగుమ్మ ఒలీవియా, మరియు బాలీవుడ్ చిన్నది అలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. కీరవాణి ఈ సినిమాకు బాణీలందిస్తున్నారు.