MAA ELECTION 2021 : పంచాయతీ ఎన్నికల కంటే దారుణం : “మా” ఎన్నికలపై ప్రముఖ నటుడు కామెంట్

-

“మా” ఎన్నికల వివాదంపై ప్రముఖ నటుడు ఒ.కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “మా” అసోసియేషన్ అంపశయ్యపై ఉందని.. 15 ఏళ్ల నుంచి “మా”లో అలజడి తప్ప అభివృద్ధి లేదని మండిపడ్డారు. “మా” ఎన్నికలు వచ్చాయంటే యుద్ధ వాతావరణం ఉంటుందని.. “మా” ఎన్నికలు పంచాయతీ ఎన్నికల కంటే దారుణంగా తయారయ్యాయని ఫైర్ అయ్యారు. “మా” అసోసియేషన్ సర్వీస్ ఓరియంట్ గా లేదని.. 25 ఏళ్లుగా “మా” అసోసియేషన్ ఎందుకు భవనాన్ని నిర్మించడం లేదని మండిపడ్డారు. పద్మాలయ స్టూడియో వెనుక 1000 గజాల స్థలం అప్పటి ప్రభుత్వం ఇస్తే నిర్లక్ష్యం చేశారని ఆరోపణలు చేశారు. ఇప్పుడున్న సినీ పెద్దలకు మా అసోసియేషన్ కు 1000 గజాల స్థలం కొనుగోలు చేసే శక్తి లేదా? అని నిలదీశారు.

“మా” అసోసియేషన్ ఎన్నికల ప్రకటన రాకుండానే ప్రకాశ్ రాజ్ ఎందుకు ముందుకు వచ్చారు? ప్రశ్నించేవాళ్లు తన చుట్టూ ఉన్నారన్న ప్రకాశ్ రాజ్ … వాళ్లు ఎంత మందిని ప్రశ్నించారు? అని మండిపడ్డారు. “మా” ఎన్నికల్లో నేను ఆరుసార్లు పోటీ చేసి ఓడిపోయానని.. మద్దతిస్తూ గెలిపించిన వాళ్లు ఎన్నికలు పూర్తవగానే తప్పకుంటున్నారని ఫైర్ అయ్యారు. “మా” అసోసియేషన్ అల్లరి కాకుండా సినీ పెద్దలు కాపాడాలని కోరారు ఒ.కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news