Anupama Parameswaran : సంక్రాంతి కుందనపు బొమ్మ.. అందాల అనుపమ

-

సంక్రాంతి పండుగకు అందాల హీరోయిన్లు కుందనపు బొమ్మల్లా ముస్తాబయ్యారు. సంప్రదాయంగా రెడీ అయి సోషల్ మీడియాలో తన అభిమానులతో ఫొటోలను షేర్ చేసుకుంది.

రెడ్ కలర్ లంగావోణీలో అనుపమ చాలా ముద్దుగా రెడీ అయింది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుని అభిమానులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది.

మలయాళ సినిమా ప్రేమమ్ రీమేక్ ప్రేమమ్ సినిమాతో తెలుగు తెరపై అరంగేట్రం చేసింది. ఆ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన అ..ఆ.. మూవీలో కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది.

ఆ తర్వాత వరుస సినిమాలతో ఇటు టాలీవుడ్.. అటు కోలీవుడ్ లో బిజీ అయింది. రెండు భాషల్లో ఈ బ్యూటీ ఫుల్ బిజీ అయింది.

మరోవైపు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లతో ఈ బ్యూటీ బిజీగా ఉంది. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఫ్రీడమ్ @ మిడ్ నైట్ షార్ట్ ఫిల్మ్ లో నటించి మెప్పించింది.

కార్తికేయ 2 సినిమాతో ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనుపమ.. ఆ సినిమాలో నటించిన నిఖిల్ తో 18 పేజెస్ తో మరో సూపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత బటర్ ఫ్లై అనే మూవీతో ఇటీవలే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news