Miss Shetty Mr Polishetty : అనుష్క, నవీన్ పొలిశెట్టి సినిమా టైటిల్ ఫిక్స్

-

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి క్రేజీ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటికే అనుష్క పోస్టర్, నవీన్ క్యారెక్టర్ ను చిత్రబృందం రివీల్ చేసింది. తాజాగా ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేసింది టీమ్. హీరో నవీన్ పొలిశెట్టి చిత్ర టైటిల్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ సినిమాకు Miss శెట్టి మిస్టర్ పొలిశెట్టి(Miss Shetty Mr Polishetty) అనే టైటిల్‌ ఫైనల్ చేశారు.

‘నేను మిమ్మల్ని చూసి చాలా కాలమైంది.. కారణమేంటంటే మేము మీకు థియేటర్లలో అత్యుత్తమ వినోదాన్ని అందించేందుకు కష్టపడుతున్నాము. ఈ సమ్మర్ 2023లో థియేటర్‌లలో మళ్లీ గోల కోసం ఎదురుచూస్తున్నా.. లవ్‌ యూ’.. అంటూ ఫస్ట్ లుక్‌ను షేర్ చేశాడు నవీన్ పొలిశెట్టి. హీరోహీరోయిన్లిద్దరి పేర్లలో శెట్టి కామన్‌గా ఉంది. ఈ సినిమా టైటిల్‌ను గమనిస్తే.. అనుష్క శెట్టిలోని శెట్టికి మిస్‌.. నవీన్‌ పొలిశెట్టిలోని పొలిశెట్టికి మిస్టర్‌ యాడ్‌ చేస్తూ టైటిల్‌ ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో న‌వీన్ పొలిశెట్టి 20 ఏళ్ల యువ‌కుడి పాత్రలో క‌నిపించ‌నుండ‌గా.. 40 ఏళ్ల మ‌హిళ‌గా అనుష్క నటించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news