పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసిన అనుష్క‌.. ఏం చెప్పిందో తెలుసా..?

-

ఇటీవ‌ల అనుష్క పెళ్లి గురించి అనేక వార్త‌లు వ‌చ్చిన‌ సంగ‌తి తెలిసిందే. వాస్త‌వానికి తెలుగు ఇండ‌స్ట్రీలో ఎప్పుడూ బోర్ కొట్ట‌ని టాపిక్ అనుష్క పెళ్లి. ఈ భామ పెళ్లి గురించి ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌లు వ‌స్తున్నా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు క‌న్ఫ్యూజ‌న్ త‌ప్ప క్లారిటీ రాలేదు. రోజు రోజుకి రూమ‌ర్లు ఎక్కువైపోతుంటే అనుష్క పెళ్లిపై రోజుకో వార్త బ‌య‌టికి వ‌స్తుంటే అభిమానుల్లో కూడా కంగారు పెరిగిపోతుంది. ఇక ఇటీవ‌ల ఓ క్రికెటర్‌ను అనుష్క త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతుంద‌న్న వార్త తెగ‌ వైర‌ల్ అయింది. అయితే దీనిపై అనుష్క స్పందించింది . ప్రేమ, పెళ్లి అంటూ తనపై వస్తోన్న రూమర్లపై అసహనం వ్యక్తం చేసింది అనుష్క. తన గురించే ఇలా ఎందుకు వదంతులు పుట్టిస్తున్నారో అర్ధం కావడం లేదని వాపోయింది.

అలాగే అస‌లు తాను ప్రేమ వివాహం చేసుకోనని.. తల్లి దండ్రులు చెప్పిన వాడినే చేసుకుంటానని, అతడితోనే తాళి కట్టించుకుంటానని క్లారిటీ ఇచ్చింది. కాగా, 2005లో హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. నటిగా ఇక్కడే స్థిరపడిపోయింది. ఆ తరువాత కోలీవుడ్ లో ‘రెండు’ అనే సినిమాతో పరిచయమైంది. అందులో మాధవన్ తో రొమాన్స్ చేసిన అనుష్క ఆ తరువాత ఇన్నేళ్లకు ‘నిశ్శబ్దం’ అనే చిత్రంలో మళ్లీ ఆయనకి జంటగా నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news