Ghaati : ట్రైలర్‌తో వచ్చేసిన ‘ఘాటి’… అనుష్క ఊర మాస్

-

తెలుగు సినీ నటి అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినీ పరిశ్రమలో అనుష్క తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకుంది. అనేక సినిమాలలో నటించి తన నటనకు గాను ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకున్న అనుష్క చాలా కాలం నుంచి సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు. వయసు పెరగడంతో సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఏవో కొన్ని సినిమాలలో మాత్రమే నటిస్తున్నారు.

ghaati
ghaati Anushka Shetty’s ‘Ghaati’ gets new release date, trailer out now

తాజాగా అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “ఘాటి”. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఘాటి సినిమాను యువి క్రియేషన్స్ సంస్థ, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఘాటి సినిమాకు నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమా ట్రైలర్ ను ఇవాళ లాంచ్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news