రాజకీయాలపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాలను పూర్తిగా దూరంగా ఉన్నానని తెలిపారు చిరంజీవి. అయినప్పటికీ సోషల్ మీడియాలో తనపై అవాకులు చవాకులు పేలుస్తుంటారన్న చిరంజీవి…. అందుకే రాజకీయ విమర్శలపై పెద్దగా స్పందించనని స్పష్టం చేసాడు.

ఫీనిక్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు చిరంజీవి. నేను చేసిన సేవా కార్యక్రమాలు, పంచిన ప్రేమ, అభిమానాలే నాకు రక్షణ కవచం… నేను మాట్లాడక్కర్లేదు, నేను చేసిన మంచే మాట్లాడుతుందన్నారు. నాపై ఓ రాజకీయ నాయకుడు విమర్శలు చేస్తే రాజమండ్రిలో ఓ మహిళ అడ్డుకొని నిలదీసిందన్నారు.
ఆ మహిళ నా అభిమాని కాదు నా వ్యక్తిత్వానికి అభిమానినని చెప్పడం గర్వంగా అనిపించింది… మళ్లీ ఆ రాజకీయ నాయకుడు ఎప్పుడు నన్ను విమర్శించలేదని పేర్కొన్నారు. ఆ రాజకీయ నాయకుడికి కూడా అంతరాత్మ ఉంటుంది కదా ?రాతలకు చేతలకు మాటలకు నేను చేసే మంచే సమాధానం అన్నారు.