మహిళల లో పీరియడ్స్ సక్రమంగా ఉండడం ఆరోగ్యానికి ముఖ్యమైన సూచిక. కొంతమంది పిరియడ్స్ సరిగా రాక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో పని ఒత్తిడి, ఆహారం, మనం ఉండే జీవనశైలి, హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్ వల్ల పీరియడ్స్ ఆలస్యం కావచ్చు. అయితే ఈ సమస్య నివారించడానికి కొన్ని సరళమైన చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. వాటి గురించి మనము తెలుసుకుందాం..
మంచి ఆహారం: ఆరోగ్యకరమైన ఆహారం పీరియడ్స్ ని సక్రమంగా ఉంచడంలో మొదటి పాత్ర పోషిస్తుంది. రోజు మనం తినే ఆహారంలో ఆకుకూరలు, పండ్లు ధాన్యాలు, వంటివి తీసుకోవడం వలన మనకు ఐరన్, విటమిన్ బి, ఒమేగా 3, ఆమ్లాలు అందుతాయి. బీట్రూట్ క్యారెట్ బాదం, జీడిపప్పు, చేపలు అవిస గింజలు లాంటివి ఆహారంలో చేర్చుకోవాలి. ఎక్కువ చక్కెర ఉండే ఆహార పదార్థాలను తగ్గించాలి. ఇవి హార్మోన్స్ ని ఇన్ బాలన్స్ చేస్తాయి.
ఒత్తిడి తగ్గించడం: పీరియడ్స్ ఆలస్యంగా రావడానికి ఒత్తిడి కూడా ఒక కారణం. మనం ఉన్న ఈ బిజీ లైఫ్ లో ఆఫీసులో ఉండే పని ఒత్తిడి కావచ్చు లేదా ఇంట్లో ఏదైనా కారణంతో మహిళలు ఎక్కువగా ఒత్తిడి కి లోనవుతున్నారు. దాని ద్వారా పీరియడ్స్ ఆలస్యంగా అవుతున్నాయి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ధ్యానం వంటివి చేయాలి. రోజు కనీసం 15 నిమిషాలు ధ్యానం చేయడం, లేదా మార్నింగ్ టైం వాకింగ్ కి వెళ్లడం వంటి అలవాట్లను మనం అలవర్చుకోవాలి.ఇలా ఒత్తిడి నియంత్రించడం వల్ల హార్మోన్లు బ్యాలెన్స్ ఇంకా ఉంటాయి, ఫలితంగా పీరియడ్స్ సక్రమంగా వస్తాయి.
వ్యాయామం: రోజు క్రమం తప్పకుండా కొంత టైం వ్యాయామానికి కేటాయించాలి.ఇది శరీర ఆరోగ్యానికి మాత్రమే కాక పీరియడ్స్ ని క్రమబద్ధం చేయడానికి కూడా వ్యాయామం సహాయపడుతుంది. వాకింగ్, జాగింగ్, సైకిల్, లేదా డాన్స్ చేయడం వంటివి కనీసం రోజుకి 30 నిమిషాలు చేయగలిగితే మన శరీరం చాలా ఫీట్ గా తయారవుతుంది.
నీరు తాగడం: శరీరంలో హార్మోన్స్, ఇన్ బ్యాలెన్స్ అవ్వడానికి,మనం నీరు తాగకపోవడం కారణం కావచ్చు. శరీరంలో నీటిలోపం వలన ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. రోజు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీరు తాగాలి. కొబ్బరి నీళ్లు, ఫ్రూట్ జ్యూస్ లు,తీసుకోవాలి. ఏదైనా వాటర్ పర్సంటేజ్ ఉన్న ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకోవాలి. శరీరంలోని టాక్సిన్స్ ని తొలగించి రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి.
సరియైన నిద్ర : మహిళలు రాత్రి సమయాలలో ఇంట్లో పనిభారం వలన లేదా ఏదైనా కారణం చేత, నిద్ర నిర్లక్ష్యం చేస్తారు. రోజు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర శరీరానికి అవసరం. ఇవి హార్మోన్లను సమతుల్యతను కాపాడుతుంది. రాత్రి సమయంలో సరైన నిద్ర లేకపోతే పీరియడ్స్ ఆలస్యం కావచ్చు అందుకే రాత్రి తొందరగా నిద్ర పోయి ఉదయం ఐదు గంటలకు నిద్ర లేవడం మంచి అలవాటు.
(గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే,పీరియడ్స్ ఆలస్యం అవుతుంటే దగ్గరిలోని వైద్యున్ని సంప్రదించండి.)