రెండు తెలుగు రాష్ట్రాలలో కీలక పరిణామం చోటుచేసుకుంది. టాలీవుడ్ నిర్మాత, కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను కలిశారు. ఇవాళ మధ్యాహ్నం పూట అమరావతి లోని చంద్రబాబు నాయుడు కార్యాలయంలో.. ఆయనను నిర్మాత బండ్ల గణేష్ కలిశారు. ఈ సందర్భంగా దాదాపు 30 నిమిషాల పాటు ఇద్దరు మధ్య సమావేశం జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అనంతరం బండ్ల గణేష్ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు సీఎం చంద్రబాబు నాయుడు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో… రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో బండ్ల గణేష్ చేయబోతున్నాడని… అందుకే సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపినట్లు చెబుతున్నారు.