అరవిందకు యు/ఏ.. సెన్సార్ కు షాక్ ఇచ్చిన వీర రాఘవ..!

-

ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా అరవింద సమేత వీర రాఘవ. ఈ ఇయర్ రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లో ఇది ఒకటి. దసరా కానుకగా ఓ వారం ముందే ప్రేక్షకులకు పండుగ తెచ్చేలా వస్తున్న అరవింద సమేత ఈ గురువారం రిలీజ్ కానుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమా నిర్మించారు.

ఈరోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న అరవింద సమేత సెన్సార్ సభ్యుల నుండి యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారట. త్రివిక్రం డైరక్షన్, ఎన్.టి.ఆర్ నటనకు సెన్సార్ సభ్యులు మెచ్చుకున్నారని తెలుస్తుంది. సినిమా సక్సెస్ అభిలాషిస్తూ చిత్రయూనిట్ కు ముందు శుభాకాంక్షలు చెప్పారట. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న అరవింద సమేత సినిమాలో ఈషా రెబ్బ, సునీల్ కూడా నటిస్తున్నారు. తమన్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version