నందమూరి హీరోలపై వస్తున్న రూమర్స్ నిజమేనా..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అగ్ర కుటుంబంగా గుర్తింపు తెచ్చుకున్న నందమూరి ఫ్యామిలీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ ఫ్యామిలీలో ఇప్పుడు చీలికలు ఏర్పడ్డాయి అనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. నిజానికి హరికృష్ణ వారసులుగా కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇద్దరూ కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.కానీ రాజకీయాల పరంగా మాత్రం ఇద్దరూ కూడా దూరంగా ఉంటున్నారు. అయితే ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ ఇద్దరూ కూడా వాళ్ళ తాత స్థాపించిన పార్టీకి దూరంగా ఉండడానికి గల కారణం కూడా లేకపోలేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే గతంలో ఎన్నికలు జరిగే సమయంలో NTR టిడిపి పార్టీ తరపున ప్రచారం చేసిన విషయం తెలిసిందే . కానీ ఆ సమయంలో నారా కుటుంబం నుంచి పెద్దగా ఎన్టీఆర్ కు ప్రాధాన్యత లభించలేదు. ఇక తర్వాత బాలయ్య కూడా నారా కుటుంబంతో కలిసిపోయి ప్రస్తుతం హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి అక్కడే గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఎమ్మెల్యేగా తన రాజకీయ ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నారు.

ఇకపోతే గత ఎన్నికలలో వైసిపి పార్టీ చేతిలో టిడిపి పార్టీ నేతలు చిత్తుచిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే అదే సమయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగితే తప్ప టిడిపి విజయం సాధించలేదు అనే వార్తలు కూడా వినిపించాయి.అంతేకాదు అభిమానులలో కూడా రెండు వర్గాలుగా చీలిపోయినట్లు సమాచారం. కొంతమంది ఎన్టీఆర్ అభిమానులుగా మారి కొంతమంది బాలకృష్ణ అభిమానులుగా ఇలా అభిమానులు కూడా మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని చర్చించుకోవడం గమనార్హం. ఒక రకంగా చెప్పాలంటే మొదట్నుంచి నారా కుటుంబంతో కలిసిన బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ను దూరంగా పెట్టాడు అనే వార్తలు బాగా వైరల్ అయ్యాయి.

ఇక ఇందుకు నిదర్శనం నిన్న కళ్యాణ్ రామ్ నటిస్తున్న బింబీసార సినిమా ఈవెంట్ నిర్వహించగా అందులో ప్రసంగించిన ఎన్టీఆర్ తన అన్న కళ్యాణ్ రామ్ గురించి అలాగే తాత ఎన్టీఆర్ గురించి చాలా గొప్పగా చెప్పాడే తప్ప బాలకృష్ణ గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. దీన్ని బట్టి చూస్తే నిజంగానే నందమూరి వారసుల మధ్య విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. మరి దీనిని నిజం కాదని నిరూపించడానికి నందమూరి హీరోలంతా ఒకే చోట కలిస్తే బాగుంటుంది అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news