వారి వల్లే దాసరి – ఎన్టీఆర్ మధ్య విభేదాలు వచ్చాయా..?

-

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు ఒక కన్ను అయితే చిత్ర పరిశ్రమకే పెద్దదిక్కు దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు అని చెప్పవచ్చు. వీరిద్దరూ కలిసి తెలుగు సినిమా పరిశ్రమకు చేసిన సేవ ఎనలేనిది. వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాలకు పని చేశారు కూడా ..ముఖ్యంగా దాసరి దర్శకత్వంలో నందమూరి తారక రామారావు అనేక సినిమాలు చేసి భారీ విజయాలను కూడా సొంతం చేసుకున్నారు.

ఇకపోతే దాసరి నారాయణరావు ఒక దర్శకుడిగా, నిర్మాతగా ఒక వెలుగు వెలిగి ఎంతో మంది స్టార్ హీరోలకు అద్భుతమైన కెరియర్ ను అందించారు ఆయన సినిమాలన్నీ కూడా టాలీవుడ్ లో ఒక సంచలనం సృష్టించాయని చెప్పవచ్చు. అంతేకాదు ఆయన సినిమాల ద్వారా ఎన్నో రికార్డులు నమోదు కూడా అయ్యాయి. అయితే ఆయన విషయంలో కొన్ని తప్పుడు ప్రచారాలు కూడా అదే విధంగా విజయం సాధించాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ తో అంత సన్నిహితంగా ఉన్న దాసరికి.. ఎన్టీఆర్ తో విభేదాలు రావడం నిజంగా బాధాకరమని చెప్పవచ్చు.

ముఖ్యంగా ఎన్టీఆర్ ని ఇబ్బంది పెట్టడానికి దాసరి రాజకీయాలు చేశారు అని, కృష్ణతో కలిసి ఎన్టీఆర్ ను ఇబ్బంది పెట్టే విధంగా కాంగ్రెస్ తో కలిసి దాసరి పనిచేశారు అంటూ ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఇది నిజం కాకపోయినా జనాలు మాత్రం దీనిని బాగా నమ్మారు. అయితే ఎన్టీఆర్ కి ఆయన ఎన్నో మంచి విజయాలను కూడా ఇచ్చారు. ఎన్టీఆర్ కెరియర్ లో చేసిన కొన్ని సినిమాలు దాసరికి కూడా మంచి పేరు తీసుకొచ్చాయి. కానీ కొంతమంది చేసిన తప్పుడు ప్రచారాల వల్ల ఎన్టీఆర్ , దాసరి మధ్య దూరం పెరిగిపోయింది. వాస్తవానికి సినిమాలపరంగా ఎటువంటి విభేదాలు లేకపోయినా రాజకీయపరంగా వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని చెప్పడంలో సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news