అరవై ఏళ్ల నాటి పాస్‌బుక్‌ ద్వారా కోటీశ్వరుడైనా వ్యక్తి.. ఎలా అంటే..!

-

ఇంట్లో పనికిరాని వస్తువులు ఉంటే ఎవరూ ఉంచుకోరు. అదే ఏవైనా పేపర్లు, పుస్తకాలు అయితే భద్రంగానే దాచుకుంటారు. మీ ఇంట్లో కూడా పనికిరాని పుస్తకాలు ఉండే ఉంటాయి కదా..! అయితే వెళ్లి వాటిని మళ్లీ ఒకసారి చూడండి.. లక్‌ బాగుంటే మీకు కూడా డబ్బులు రావొచ్చేమో.. అర్థంకావడం లేదా..? ఓ వ్యక్తి తన ఇంట్లో పనికిరాని పాత్‌ పాస్‌బుక్‌ ద్వారా ఓవర్‌ నైట్‌లో కోటీశ్వరుడయ్యాడు. ఎందుకు పనికిరాదు అన్న పుస్తకం ద్వారా అతనికి అన్ని కోట్లు ఎలా వచ్చాయి అనుకుంటున్నారా..?దీని వెనుక ఒక ఇంట్రస్టింగ్‌ స్టోరీ ఉంది..! అదేంటంటే..

చిలీకి (Chile) చెందిన ఎక్సిక్వియెల్ హినోజోసా (Exequiel Hinojosa) జీవితంలో ఒక్కరాత్రిలో మారిపోయిది. ఆ వ్యక్తి ఇల్లు క్లీన్ చేస్తుండగా అతని తండ్రికి చెందిన ఓ బ్యాంక్ పాస్‌బుక్‌ దొరికింది. అది ఒక పనికిరాని పుస్తకం అనుకున్నాడు. కానీ దానిని నిశితంగా పరిశీలించగా, అది తన తండ్రి బ్యాంక్ పాస్‌బుక్ అని, చాలా కాలం నాటిదని తెలిసింది. ఈ బ్యాంకు పాస్‌బుక్, అందులోని మనీ గురించి ఎక్సిక్వియెల్ తండ్రికి మాత్రమే తెలుసు. అయితే అతడి తండ్రి పదేళ్ల కిందటే మరణించాడు. దీనితో దాని గురించి ఎవరికీ తెలియకుండా పోయింది. దొరికిన ఆ పాక్‌బుక్‌లో వివరాలు చూస్తే.. 1960-70ల కాలంలో ఎక్సిక్వియెల్ తండ్రి దాదాపు 1.40 లక్షల చిలీ పెసోలను (Chilean pesos) బ్యాంకులో డిపాజిట్ చేశాడు. ఆ డబ్బుతో భవిష్యత్తులో ఇల్లు కొనాలనుకున్నాడు. ఆ మొత్తం విలువ ఇప్పుడు $163 లేదా 13,480 భారతీయ రూపాయిలు. ఇప్పుడు చిన్న అమౌంట్‌గా కనిపిస్తుంది కానీ ఆరోజుల్లో అది లక్షలతో సమానం. ఆ డబ్బులైనా విత్‌డ్రా చేసుకోవాలని అనుకున్నాడు ఎక్సిక్వియెల్.

పాస్‌బుక్‌ను జారీ చేసిన బ్యాంకు చాలా కాలం కిందటే క్లోజ్ అయింది. ఈ విషయం తెలిసిన ఎక్సిక్వియెల్ ఇక ఆ పైసల్ రానట్లే అనుకున్నాడు. గతంలో చాలా మంది ఇతర వ్యక్తులు కూడా అదే బ్యాంకుకు చెందిన ఇలాంటి పాస్‌బుక్‌లతో వచ్చి ఎంక్వైరీలు చేశారు. వారందరూ డబ్బును తిరిగి పొందడం కష్టమైంది. అయితే, ఒక చిన్న నిబంధనను పాస్‌బుక్‌పై చూశాక ఎక్సిక్వియెల్‌లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఆ పాస్‌బుక్‌పై “స్టేట్ గ్యారెంటీడ్ (State Guaranteed)” అనే పదాలు ఉన్నాయి. దీనర్థం బ్యాంక్ డబ్బు ఇవ్వని పక్షంలో, డబ్బు తిరిగి కస్టమర్‌కు అందేలా ప్రభుత్వం సహాయం చేస్తుంది. అంతే ఆ లైన్‌ పట్టుకుని ఎక్సిక్వియెల్‌ ప్రభుత్వాన్ని డబ్బు ఇవ్వాల్సిందిగా కోరాడు..

ప్రభుత్వం సహాయం చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఎక్సిక్వియెల్‌కు మాత్రం డబ్బు ఇవ్వడానికి ఇష్టపడలేదు. అందుకే ఎక్సిక్వియెల్‌ కోర్టును ఆశ్రయించాడు. ఆ డబ్బు తన తండ్రి సేవింగ్స్ అని, ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వాదించాడు. దాని గురించి ఆలోచించిన తర్వాత, కోర్టు ఎక్సిక్విల్‌తో ఏకీభవించింది. అతనికి భారీ మొత్తంలో 1 బిలియన్ చిలీ పెసోలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 1 బిలియన్ చిలీ పెసోలు అంటే దాదాపు 1.2 మిలియన్ డాలర్లు లేదా మన కరెన్సీలో దాదాపు 10 కోట్ల రూపాయలు. ఈ మొత్తంతో వడ్డీ, అలవెన్సుల డబ్బు కూడా ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అలా ఓవర్‌నైట్‌లో ఈ చిలీ వ్యక్తి కోటీశ్వరుడు అయ్యాడు.

ప్రభుత్వం అంత మొత్తం డబ్బులు చెల్లించడానికి అంగీకరించలేదు. సుప్రీంకోర్టులో కేసు కూడా వేసింది. ఆ అత్యున్నత న్యాయస్థానం కూడా అతనికి సానుకూలంగా తీర్పు వెలువరిస్తే పది కోట్ల రూపాయలు ఎక్సిక్వియెల్ సొంతమవుతాయి. అలా ఎందుకు పనికిరాదు అనుకున్న పుస్తకం ద్వారా అతని లైఫే మారిపోయింది.!

Read more RELATED
Recommended to you

Latest news