ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్..?: ప్రభాస్

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు నెలల క్రితమే సినీ పరిశ్రమకు కీలక సూచనలు చేసిన విషయం తెలిసిందే. డ్రగ్స్, సైబర్ క్రైమ్ పై సినిమాలలో అవగాహన కల్పించాలని, వీటి గురించి సినిమాకి ముందు డిస్క్లైమర్స్ ప్రదర్శించాలని పేర్కొన్నారు. అంతేకాదు ఇటీవల తెలుగు సినిమా ఇండస్ట్రీలోని పెద్దలతో సమావేశమైన సీఎం రేవంత్.. తెలంగాణ రైజింగ్ లో సినీ ఇండస్ట్రీకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని సూచించారు.

డ్రగ్స్ కి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయాలని, మహిళా భద్రత క్యాంపెయిన్ విషయంలో చొరవ తీసుకోవాలని సలహా ఇచ్చారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల విషయంలోనూ ఇండస్ట్రీ నుంచి సహకారం కావాలని సూచించారు. ఈ నేపథ్యంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా డ్రగ్స్ కి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తూ ఓ వీడియోని విడుదల చేశారు.

ఈ వీడియోలో ప్రభాస్ మాట్లాడుతూ.. “జీవితంలో మనకి ఎన్నో ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి. కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మనకోసం బ్రతికే మనవాళ్లు ఉన్నప్పుడు.. “ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్” say no to drugs today.. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కి బానిసలు అయితే వెంటనే ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది” అని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news