అనారోగ్య బారిన పడ్డ అరియానా.. ఆందోళనలో ఫాన్స్..!

-

ప్రముఖ బిగ్ బాస్ బ్యూటీ అరియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొన్నమధ్య రాంగోపాల్ వర్మతో ఆమె చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ ఆమెను మరింత వైరల్ గా మార్చింది. ఇక అప్పటినుంచి టీవీ షో లతో బిజీగా ఉండే ఈమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోషూట్లతో యువతను ఆకట్టుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా టీవీ షోలలో ముక్కు అవినాష్ తో ఈమె చేసిన స్కిట్లు బుల్లితెరపై బాగా హిట్ అయ్యాయి అని చెప్పాలి. ఇక అలాగే బిగ్ బాస్ జోడిలో రన్నర్ అప్పుగా కూడా నిలిచింది ఈ జోడి.

ఇదిలా ఉండగా తాజాగా ఆమె అనారోగ్యం బారిన పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోని కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చాలా వైరల్ గా మారుతుంది.ఇది చూసిన చాలా మంది అరియానా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.. చాలా రోజులుగా ఆమె జ్వరంతో బాధపడుతున్నాను అని స్పష్టం చేసింది. ఇకపోతే చికిత్స తీసుకుంటున్నాను.. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగా ఉంది.. కాస్త విశ్రాంతి తీసుకుంటున్నాను అంటూ వీడియోలో చెప్పుకొచ్చింది.

అయితే ఈ వీడియోలో అరియానా చేతికి సిరంజి స్టిక్కర్ ఉండడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఇటీవలే బిగ్ బాస్ జోడిలో అవినాష్ తో కలిసి పాల్గొన్న అరియానా తన డాన్సింగ్తో అందరిని ఆకట్టుకుంది. అరియానా జోడి ఈ షోలో ఫైనల్ వరకు వెళ్ళింది. కానీ సూర్య, ఫైమా జోడి ముందు మీరు ఓడిపోయారని చెప్పాలి . అయితే ఈ అమ్మడికి మాత్రం మంచి గుర్తింపు లభించింది అని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version