Arjun Reddy: మళ్లీ థియేటర్స్‌లో ‘అర్జున్ రెడ్డి’ సినిమా విడుదల..ఎందుకు, ఎప్పుడో మీకు తెలుసా?

-

టాలీవుడ్‌‌లోనే కాదు బాలీవుడ్ లోనూ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన సినిమా ‘అర్జున్ రెడ్డి’. ఈ చిత్రంతో రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్టార్ అయ్యాడని చెప్పొచ్చు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్..ఎవరూ ఊహించని విధంగా భారీ విజయం అందుకుంది. ఈ మూవీతో సందీప్ రెడ్డి సైతం స్టార్ డైరెక్టర్ అయిపోయారు.

ఇదే సినిమాను బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం బీ టౌన్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తో ‘యానిమల్’ ఫిల్మ్ చేస్తున్న సందీప్.. తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘స్పిరిట్’ పిక్చర్ చేయనున్నారు. ‘అర్జున్ రెడ్డి’ వంటి బోల్డ్ పిక్చర్ తో తెలుగులో సరికొత్త ట్రెండ్ షురూ చేశారు సందీప్ రెడ్డి.

‘అర్జున్ రెడ్డి’ సినిమాతోనే కెరీర్ స్టార్ట్ చేసిన సందీప్..వెరీ బోల్డ్ కంటెంట్ ను సినిమాగా తీశారు. అయితే, ఈ చిత్రంలోని పలు సీన్లకు సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలపగా, కొన్నిటినీ మార్చారు. అయితే, అర్జున్ రెడ్డి ఔట్ పుల్ ఫిల్మ్ 4 గంటల 20 నిమిషాలు ఉండగా, దానిని 3 గంటల 45 నిమిషాలకు కుదించారని టాక్.

arjun reddy

అంత నిడివిని కూడా ప్రేక్షకులు చూడలేరని, చివరకు 3 గంటల 6 నిమిషాల నిడివితో సినిమాను థియేటర్స్ లో విడుదల చేశారు. అలా ఆగస్టు 25కి అర్జున్ రెడ్డి పిక్చర్ విడుదలై ఐదేళ్లవుతోంది. కాగా, ఈ ఏడాది అదే రోజున అనగా ఆగస్టు 25, 2022న ఎటువంటి కట్స్ లేకుండా ఫుల్ పిక్చర్ ను థియేటర్స్‌లో విడుదలకు ట్రై చేస్తున్నట్లు డైరెక్టర్ సందీప్ తెలిపారని టాక్. చూడాలి మరి.. ఏం జరుగుతుందో.. ఒకవేళ టాకీసుల్లో విడుదలకు అనుమతించకపోతే యూట్యూబ్ లో రిలీజ్ చేసే చాన్సెస్ ఉన్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version