Viswambhara : మెగాస్టార్ మూవీ లో మరో బ్యూటీఫుల్ హీరోయిన్..

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 156వ చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసారా’ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వెలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల తేదీని ఇటీవలే చిత్రబృందం ప్రకటించింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపింది. ఇక ఇందులో చిరంజీవికి జంటగా త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే.

Ashika Ranganath joins Chiranjeevi in the socio-fantasy Vishwambhara

ఇక తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ హీరోయిన్ ని పరిచయం చేసింది “విశ్వంభర” టీం. ఇందులో మరో యంగ్ హీరోయిన్ నటించబోతుంది. ఆమె క్యూట్ బ్యూటీ అషికా రంగనాథన్. తాజాగా మూవీ టీం ఆశికాను మూవీ సెట్ లోకి ఆహ్వానించింది. ఆమె పోస్టర్ రిలీజ్ చేస్తూ మా ఎపిక్ సినిమాటిక్ జర్నీ విశ్వంభర సెట్ లోకి ఆషికా రంగనాథన్ ను ఆహ్వానిస్తున్నామంటూ ఎక్స్ లో అధికారిక ప్రకటన ఇచ్చింది. ప్రస్తుతం అషికా పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news