తెలంగాణలో రాబోయేది బీజేపీ పార్టీనే – ఈటల రాజేందర్‌

-

తెలంగాణలో రాబోయేది బీజేపీ పార్టీనేని తెలిపారు బీజేపీ అగ్ర నాయకులు ఈటల రాజేందర్‌. తొర్రూరులో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల రాజేందర్…అనంతరం మాట్లాడారు. ఈరోజు ఒక లెక్చరర్ తన గోడును చెప్పుకున్నారు. తమ బాధలు ఎవ్వరూ పట్టించుకోవట్లేదని వాపోయారన్నారు. గత బీఆర్‌స్ ప్రభుత్వం, నేడు కాంగ్రెస్ పార్టీ కూడా తమ తమ ప్రయోజనాలే కానీ ఉద్యోగుల గొడవ పట్టించుకోవట్లేదు. ఉపాధ్యాయులకు, లెక్చరర్లకు సరిగ్గా జీతాలు ఇవ్వడం లేదు. వారికి పూర్తిగా 12 నెలల జీతం రావడం లేదని వివరించారు.

తెలంగాణలో ఏ సంఘం వారికి సమస్యలు వచ్చినా వారికి నేను అండగా ఉంటాను….బీజేపీ పార్టీ బలపరిచిన ప్రేమేందర్ రెడ్డి గారు 40 ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్నారు. పార్టీ కోసం ఎంతో శ్రమిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ తెలంగాణలో అధికారంలోకి వచ్చారు. కానీ ఉద్యోగాల సంగతి ఏమాత్రం పట్టించుకోలేదు. ఉద్యోగాలు రాని వాళ్లకు నిరుద్యోగ భృతి ఇస్తానని వారిని మభ్యపెట్టాడు. ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదని ఫైర్‌అయ్యారు. బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తితో కాంగ్రెస్‌కు ఓటు వేస్తే, నాలుగు వేలు నిరుద్యోగ భృతిగా ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి కూడా మాట తప్పాడు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతున్నా ఇంతవరకూ ఆ ఊసే లేదు. ఒడ్డెక్కేదాక ఓడ మల్లప్ప, ఒడ్డెక్కినాక బోడ మల్లప్ప అనే సామెతలా తయారయ్యారన్నారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధిక ట్యాక్సులు వసూలు చేస్తోందని స్వయంగా దేశ ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌షా ప్రకటించారు….ఉద్యోగులకు పీఆర్‌సీ ఇంతవరకూ అమలు చేయలేదు. 2023 జూన్‌లో పీఆర్‌సీ అమలు చేస్తామన్నారు. కానీ ఏడాది గడిచినా చేయట్లేదని వివరించారు. ఉద్యోగులకు ఆరోగ్యభీమా కూడా సరిగ్గా అందడంలేదు. జర్నలిస్టులకు, ఉద్యోగులకు ఆరోగ్యశ్రీ డబ్బు కూడా రావట్లేదు. కాంట్రాక్టర్లకు డబ్బులిస్తున్నారు కానీ ఈ ప్రభుత్వాలు ఆర్టీసీ కార్మికులకు, ఉద్యోగులకు ఏమాత్రం జీతాలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news