టాలీవుడ్ లో కలకలం… డ్రగ్స్ కేసులో అషూ రెడ్డి…క్లారిటీ ఇదే ?

-

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేపుతోంది. తెలుగు సినీ పరిశ్రమల మరోసారి డ్రగ్స్ ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. టాలీవుడ్ కి చెందిన ఆషు రెడ్డి పేరు ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కేపీ చౌదరి కాల్ లిస్ట్ లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో ఆమె పేరు ఇప్పుడు వైరల్ అవుతుంది. తాజాగా ఇదే విషయంపై ఆమె స్పందించింది.

తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ అషు రెడ్డి ఫైర్ అయింది. డ్రగ్స్ కేసులో తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపింది. మీడియాలో పేర్కొన్నట్లు తనకు ఎవరితోనూ డ్రగ్స్ సంబంధాలు లేవని చెప్పింది. అవన్నీ తప్పుడు వార్తలని ఆమె కొట్టిపారేసింది. అవసరమైతే విచారణ ఎదుర్కొంటానని సంబంధిత అధికారులకు వాస్తవం ఏమిటో తెలియజేస్తానని తెలిపింది. కానీ తన ఫోన్ నంబర్ ను అనుమతి లేకుండా బహిరంగంగా ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరికలు చేసింది. కాగా, ఈ కేసులో నటి సురేఖ వాణి కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version