నిన్న తిరుమలలో ఐదేళ్ల బాలుడుపై చిరుత దాడి చేసిన సంగతి తెలిసిందే. మొదటి ఘాట్ రోడ్డులో బాలుడిని చిరుత ఎత్తుకెళ్లే ప్రయత్నం చేసింది. పోలీసులు కేకలు వేయడంతో వదిలేసి వెళ్లిపోయింది. గాయపడిన బాలుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
అయితే.. తాజాగా తిరుమల నడకదారిలో ఐదేళ్ల బాలుడు కౌశిక్ పై దాడిచేసిన చిరుతను అటవీ అధికారులు బంధించారు. రెండుచోట్ల బోన్లు, సీసీ కెమెరాల సహాయంతో దాన్ని పట్టుకున్నారు. కాగా గురువారం నడక మార్గంలో తిరుమలకు కుటుంబంతో కలిసి వెళుతున్న కౌశిక్ పై చిరుత అకస్మాత్తుగా దాడి చేసి ఎత్తుకుపోయింది. ఇది గమనించిన పోలీసులు వెంటపడడంతో బాలుడిని వదిలేసింది.