బాలయ్య బాబు మూవీ ని అడ్డుకునే ప్రయత్నాలు.!

-

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు నటించిన తాజా చిత్రం వీర సింహారెడ్డి. ఈ సినిమా తాజాగా జనవరి 12న విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల అయి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఎక్కడా చూసినా బాలయ్య సినిమా గురించే చర్చ నడుస్తోంది.

ఇక సినిమాలోని పాటలు సన్నివేశాలు, డైలాగ్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి అని ఫ్యాన్స్ గోల గోల చేస్తున్నారు. ఇక బాలయ్య బాబు చెప్పిన డైలాగ్స్ అయితే థియేటర్లలో అభిమానులను విజిల్స్ కొట్టించాయి. ఈ వయసులో కూడా అదే ఎనర్జీతో అంతే ఎనర్జిటిక్ గా బాలయ్య బాబు డైలాగులు చెప్పడంతో అభిమానులు అవధులు లేకుండా పోయాయి. ఆ డైలాగ్స్ కూడా గవర్నమెంట్ కు టార్గెట్ చేసినట్లు గా కనపడింది.

ఇదే విషయాన్ని ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకున్నారు అనే సమాచారం వినిపిస్తోంది. అసలే ఇంకో సంవత్సరం లో ఎన్నికలు రాబోతున్నాయి ఈ టైమ్ లో ప్రభుత్వం కు చెడ్డ పేరు వేస్తే ఎలా అని చాలా కోపంగా ఉన్నారట. అందుకే కీలక అధికారులను సినిమా చూసి నివేదిక ఇమ్మని చెప్పారట. వారు కూడా సినిమాలో గవర్నమెంట్ ఇమేజ్ డామేజ్ అయ్యే డైలాగ్స్ చాలా ఉన్నాయని నివేదిక ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దానితో బాలయ్య బాబు సినిమాను ఆపేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్లుగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version