హాలీవుడ్ దిగ్గజ దర్శకుడి తో రాజమౌళి..!!

-

లాస్ ఏంజెల్స్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఫంక్షన్ లో  బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ‘నాటు నాటు’ సాంగ్ కు గానూ ఆర్ ఆర్ ఆర్ మూవీ  గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సాధించింన  సంగతి అందరికీ తెలిసిందే. దీనితో దేశం మొత్తం ఆర్ ఆర్ ఆర్ మూవీ మేనియా తో ఊగిపోయింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ RRR టీం కు అభినందనలు తెలిపారు.

సాక్షాత్తు దేశ ప్రధాని మంత్రి మోదీ గారు కూడా ఆర్ ఆర్ ఆర్ మూవీ టీమ్ కు అభినందనలు తెలిపారు. ఇక రాజమౌళి టీమ్ కూడా అమెరికాలో కూడా తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే అక్కడి మీడియా వారికి ఇంటర్వ్యూ లు ఇస్తూ సందడి చేస్తున్నారు. అలాగే అక్కడి హలీవుడ్ ప్రముఖుల తో పరిచయాలు పెంచుకుంటూ హంగామా చేస్తున్నారు.

ఇక రీసెంట్ గా రాజమౌళి ప్రపంచం లో దిగ్గజ దర్శకుడి గా పేరు తెచ్చుకున్న స్టీవెన్ స్పీల్ బర్గ్ కలసి తెగ ఆనంద పడుతున్నారు.స్టీవెన్ స్పీల్ బర్గ్. జురాసిక్ పార్క్ సినిమాలతో ప్రపంచంలో సూపర్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే.అలాంటి ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ ని దర్శకధీరుడు రాజమౌళి మరియు కీరవాణితో కలిసి మాట్లాడారు. ఆ సందర్బంగా స్టీవెన్ స్పీల్ బర్గ్ లో  దిగిన ఫొటో లో నేను ఇప్పుడే దేవుడిని కలిశాను అంటూ  ఆ ఫొటోని  రాజమౌళి సోషల్ మీడియా లో పెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version