Avatar 2: ఓటీటీలోకి అవతార్ 2.. ప్రీ బుకింగ్ ధర తెలిస్తే షాక్..!

-

Avatar 2 – ప్రముఖ హాలీవుడ్ లెజెండ్రీ దర్శకుడు జేమ్స్ కామరూన్ తెరకెక్కించిన తాజా చిత్రం అవతార్ 2.. గత ఏడాది విడుదలైన ఈ సినిమా తాజాగా మార్చి 28వ తేదీ నుంచి డిజిటల్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ మూవీ రెంట్ ప్రైస్ ను కూడా చిత్ర బృందం ప్రకటించింది. భారీ అంచనాల మధ్య గత ఏడాది విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూల్ల సునామీ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా 2.305 బిలియన్ డాలర్లను వసూలు చేసి సరికొత్త రికార్డులకు తెరలేపింది. ఇక అకాడమీ అవార్డుల్లో కూడా ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ చిత్రంగా ఆస్కార్ ను సొంతం చేసుకుంది.

ఇకపోతే మార్చి 28వ తేదీ నుంచి ఈ చిత్రాన్ని డిజిటల్ గా అందుబాటులోకి తీసుకురానున్నారు. ముఖ్యంగా ఇందుకు సంబంధించిన వివరాలను అవతార్ టీం తాజాగా వెల్లడించింది. మార్చి 28 నుంచి యాపిల్ టీవీ, మూవీ ఎస్ ఎనీ వేర్ ,గూగుల్ ప్లే, వుడ్ , మైక్రోసాఫ్ట్ మూవీ అండ్ టీవీ, ప్రైమ్ వీడియో వంటి వాటిల్లో స్ట్రీమింగ్ కానుంది. అయితే మొదట ఈ సినిమాను అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అయితే ఈ సినిమా చూడాలని ఆసక్తి ఉన్నవారు ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. డిస్నీ మూవీస్ ఇన్ సైడ్స్ వెబ్సైట్లో ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంచారు.

మరి ఇంతకు ఈ మూవీ అద్దె ఎంత వుంది అంటే మన కరెన్సీ ప్రకారం సుమారుగా రూ.1600 .. మార్చి 28వ తేదీ ఉదయం 9:30 గంటల నుంచి అవతార్ 2 చూడవచ్చు.ఒకసారి మూవీని ప్రీ ఆర్డర్ చేసిన తర్వాత 48 గంటల్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు. అయితే ఒకసారి మూవీని చూడడం డౌన్లోడ్ చేయడం వంటివి చేస్తే క్యాన్సిల్ చేయడం కుదరదు.

Read more RELATED
Recommended to you

Latest news