బేబీ: వైష్ణవి హీరోయిన్గా సక్సెస్ అందుకుందా..?

-

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య కాంబినేషన్లో వచ్చిన చిత్రం బేబీ. ఈరోజు విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. యూట్యూబర్ గా గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య తొలిసారి ఇండస్ట్రీకి పరిచయం అవుతూ తెరకెక్కిన ఈ సినిమా ఆమెకు ఎలాంటి విజయాన్ని అందించింది అనే విషయం ఇప్పుడు చూద్దాం..

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా దొరసాని , మిడిల్ క్లాస్ మెలోడీస్, హైవే , పుష్పక విమానం వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కానీ ఏవి కూడా పెద్దగా కమర్షియల్ హిట్ అందించలేదు. థియేట్రికల్ హిట్ కూడా అందలేదు. దీంతో గట్టి హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆనంద్ దేవరకొండ బేబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాలో ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించగా.. ఈ సినిమా ఈరోజు విడుదల కానుండగా వైష్ణవి ఈ సినిమాతో హీరోయిన్గా సక్సెస్ అందుకుందా లేదా అనే విషయానికి వస్తే.. మొదటి సినిమాతోనే తన లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది.

వైష్ణవి ఈ సినిమాలో మొదట డీ గ్లామరస్ పాత్రలో నటించినా.. ఆ తర్వాత చాలా లవ్లీగా కనిపించి యువతను ఆకట్టుకుంది. తన నటనతోనే ప్రేక్షకులను మెప్పించింది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించిన ఈమె ఈ సినిమాతో హీరోయిన్గా సక్సెస్ అందుకుంది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే హీరోయిన్ గా ఒక మెట్టు ఎక్కింది అంటూ అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news