కాబోయే వరుడిని పరిచయం చేసిన బేబీ హీరోయిన్..!!

-

ఒకానొక సమయంలో సోషల్ మీడియా ద్వారా తన పరిచయాన్ని పెంచుకొని ఆ తర్వాత యూట్యూబ్ ద్వారా పలు వీడియో ఆల్బమ్స్ చేసి షార్ట్ ఫిలిమ్స్ తో మరింత దగ్గరైన వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఇటీవల ఈమె తాజాగా సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన బేబీ సినిమాలో హీరోయిన్ గా నటించి తన నటనతో అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలను సైతం మెప్పించింది ముఖ్యంగా ఈమె నటన సహజంగా ఉందని ఖచ్చితంగా స్టార్ హీరోయిన్ అవుతుందని బన్నీ కూడా ప్రశంసించారు అంటే ఇక తన నటనతో ఆమె ఎంతలా ప్రేక్షకులను అలరించిందో అర్థం చేసుకోవచ్చు.

ఇకపోతే బేబీ సినిమా తర్వాత వైష్ణవి చైతన్యను అభిమానించే వారి సంఖ్య ఎక్కువే అవుతుంది. అందుకే ఆమెకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా క్షణాల్లో వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియాలో నెటిజన్స్ ఈమె గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి తెగ గూగుల్ లో వెతికేస్తున్నారు. అలా వెతకగా ఆమెకు సంబంధించిన పాత ఇంటర్వ్యూలు కొన్ని వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగానే తనకు కాబోయే వరుడు గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది వైష్ణవి చైతన్య.

అందులో తనకు కాబోయే వరుడు ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. తనకు కాబోయే వరుడు పెద్దగా అందగాడు కావాల్సిన అవసరం లేదు.. చాలా డబ్బు ఉండాల్సిన పనిలేదు. మిగతా అమ్మాయిల లాగా ఆకాశాన్ని తాకే అంచనాలు ఏమీ లేవు. తనను బాగా చూసుకుంటే చాలు.. ఒక కామన్ లైఫ్ గడపాలని ఉంది అంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక ఈ మాటలు విన్న చాలా మంది కుర్రాళ్ళు మాలో ఈ లక్షణాలు ఉన్నాయి. మమ్మల్ని పెళ్లి చేసుకో అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version