టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. బలగం సినిమా నటుడు కన్నుమూశాడు. ప్రముఖ రంగస్థల కళాకారుడు, బలగం సినిమా నుండి జీవి బాబు కాసేపటి క్రితం మృతి చెందారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో జీవి బాబు…. వరంగల్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా ఆయన పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని కూడా వార్తలు వచ్చాయి.
ఇలాంటి నేపథ్యంలోనే తాజాగా.. ఆయన పరిస్థితి మరింత విశ్రమించడంతో మృతి చెందారు. ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో జీవీ బాబు మరణించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు కుటుంబ సభ్యులు. కాగా వెల్దండి వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమాలో జీవి బాబు కీలక పాత్ర పోషించారు.