బాలకృష్ణ కండీషన్స్ పెట్టడా..!

-

ఎన్.టి.ఆర్ కథానాయకుడు ఇచ్చిన షాక్ తో నందమూరి బాలకృష్ణ తన తర్వాత సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎన్.టి.ఆర్ కథానాయకుడు ఫలితం బాలయ్యకు అసంతృప్తి మిగిల్చింది. అందుకే బోయపాటి శ్రీను సినిమాకు కండీషన్స్ పెడుతున్నాడట. బోయపాటి, బాలయ్య ఇద్దరు కలిసి సింహా, లెజెండ్ సినిమాలు చేశారు.

హ్యాట్రిక్ కాంబినేషన్ గా వస్తున్న ఈ సినిమా బడ్జెట్ 70 కోట్ల దాకా ప్లాన్ చేశాడట బోయపాటి శ్రీను. కాని బాలకృష్ణ మాత్రం 50 కోట్లలో సినిమా పూర్తి చేయాలని కండీషన్ పెట్టాడట. ఈ సినిమా కూడా బాలయ్య స్థాపించిన ఎన్.బి.కే ప్రొడక్షన్ లో నిర్మించబడుతుంది. మొత్తానికి ఎన్.టి.ఆర్ సినిమాతో బాలకృష్ణ కాస్త వెనుకడుగు వేశాడని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version