ఫోటో పెట్టాలంటే భయంగా ఉందంటున్న లయ..!

-

కాస్టింగ్ కౌచ్ పై తన అభిప్రాయాన్ని భిన్నంగా వ్యక్తపరచిన నిన్నటి తరం హీరోయిన్ లయ కేవలం సిని పరిశ్రమలోనే కాదు అన్ని రంగాల్లో లైంగిక వేధింపులు ఉన్నాయని ఓ రకంగా ఇండస్ట్రీ వైపు నుండి మాట్లాడింది. అలాంటి లయ సోషల్ మీడియా వల్ల ఫ్యామిలీ ఫోటో పెడితే దాన్ని ఎలా మారుస్తారో అంటూ తన భయాందోళనలను బయట పెట్టింది. ఇంతకీ మీడియాపై లయ ఎందుకు అంత మాట అనేసింది అంటే ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో తన తెలుగు సరిగా లేదని సోషల్ మీడియా ఆటాడేసుకుంది.

ఈ విషయాన్ని ప్రస్థావిస్తూ పెళ్లి తర్వాత ఫారిన్ లో సెటిల్ అవడం వల్ల తెలుగు సరిగా మాట్లాడలేకపోయాను. అయినంత మాత్రానా దాన్ని రకరకాలుగా వార్తలు రాస్తారా అంటూ వాదించింది. ఇలానే హీరోల మీద వార్తలు రాసే ధైర్యం ఉందా. కనీసం తమ పర్సనల్ ఫోటోలను షేర్ చేసుకుందామని అనుకున్నా వాటిని ఎక్కడ న్యూస్ చేస్తారో అని భయపడుతున్నామని అంది లయ. మొత్తానికి సోషల్ మీడియా ప్రభావం ఏ రేంజ్ లో ఉంటుందో లయకి బాగా అర్ధమైనట్టు ఉంది. కానీ, అచ్చమైన తెలుగమ్యాయిగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న లయ ఫారిన్‌లో ఉన్నంతమాత్రాన మాతృభాష ఎలా మర్చిపోయిందో ఎవరికీ అంతుబట్టడంలేదు. సోషల్‌మీడియా హీరోలతో సహా ఎవరినీ స్సేర్‌ చేయడంలేదని కూడా లయకు తెలిసినట్లులేదు. అంత భయమున్నప్పుడు సోషల్‌మీడియా జోలికి వెళ్లకపోవడమే మేలు కదా అమ్మడూ..

Read more RELATED
Recommended to you

Exit mobile version