చంద్రమోహన్ మరణం పట్ల బాలకృష్ణ ఎమోషనల్

-

టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రమోహన్ మరణంపై నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఆయన మరణం బాధాకరమంటూ బాలయ్య ఎమోషనల్ అయ్యారు.

పౌరాణిక చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు, తన హాస్యనటనతో తెలుగు ప్రేక్షకులను చంద్రమోహన్ ఆకట్టుకున్నారని గుర్తు చేసుకున్నారు. చంద్రమోహన్ తో పాటు పలు చిత్రాల్లో నటించానని, ఆయన మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు లోటు అన్నారు. చంద్రమోహన్ ఆత్మకు శాంతికలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు బాలకృష్ణ.

మరోవైపు చంద్రమోహన్‌ మృతి చెందారని తెలిసి బాధపడ్డానని ప్రముఖ నటుడు వెంకటేశ్‌ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చంద్రమోహన్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. చంద్రమోహన్‌ మృతికి సినీనటుడు సాయిధరమ్‌ తేజ్‌ ట్విటర్‌ వేదికగా సంతాపం తెలిపారు. ఆయన సినిమాల్లో తనదైన నటనతో ముద్ర వేశారన్నారు. చంద్రమోహన్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news