`రూల‌ర్‌`లో బాల‌య్య స్టెప్పులు మామూలుగా లేవుగా.. (వీడియో)

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం రూలర్.. కేయస్ రవికుమార్ దర్శకత్వం వహించగా, సీ కళ్యాణ్ ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే చిత్రకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ నిన్న విశాఖలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించింది. ఇదిలా ఉంటే.. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ డాన్సర్స్‌లో బాలయ్య కూడా ఒకరు. ఈయన వయసు 60కి చేరినా కూడా మనసు మాత్రం ఇంకా 20ల్లోనే ఆగిపోయింది. ఇప్పటికీ అదే ఎనర్జీతో దుమ్ము దులిపేస్తుంటాడు బాలయ్య.

ఇక రూలర్ సినిమాలో కూడా ఇదే చేస్తున్నాడు బాలకృష్ణ. తాజాగా విడుదలైన ప్రోమో వీడియోలో బాలయ్య డాన్సులు చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. ఈ ప్రోమో సాంగ్‌లో అదిరిపోయే స్టెప్పులేసాడు నందమూరి హీరో. ఈ సీనియర్ హీరో జోరు చూసి వామ్మో అనుకుంటున్నారు ప్రేక్షకులు. ఈ పాటలో సోనాల్ చౌహాన్ హీరోయిన్. గతంలో కూడా అమ్మకుట్టి అమ్మకుట్టి అంటూ రెచ్చిపోయిన బాలయ్య.. ఇప్పుడు పడతాడు అంటూ చిందులు చించేసాడు. కాగా, యాక్షన్, మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్క‌నుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ ఆసక్తి రేకెత్తిస్తోంది.