యాంగ్రీ స్టార్ రాజశేఖర్ నటించిన ‘సింహరాశి’ చిత్రం సూపర్ హిట్ అయింది. థియేటర్లలో ఈ మూవీ చూసి జనాలు కన్నీటి పర్యంతమయ్యారు. ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ ప్లస్ సెంటిమెంట్ పాళ్లు అధికంగా ఉన్న ఈ పిక్చర్ రాజశేఖర్ కెరీర్ లో బ్లాక్ బాస్టర్ పిక్చర్ గా నిలిచింది. అయితే, నిజానికి ఈ మూవీ నందమూరి నటసింహం బాలయ్య చేయాల్సిందట. కానీ, ఆయన ఈ చిత్ర కథను తిరస్కరించడంతో రాజశేఖర్ వద్దకు వచ్చింది. ఆయన ఎందుకు ఈ ఫిల్మ్ స్టోరిని రిజెక్ట్ చేశాడో ఇక్కడ తెలుసుకుందాం.
ఈ క్రమంలోనే ఆ చిత్రం తర్వాత సినిమా షూటింగ్ లో ఉన్న బాలయ్యకు దర్శకుడు సముద్ర ..‘సింహరాశి’ పిక్చర్ స్టోరి చెప్పాడు. అయితే, అప్పటికే తాను ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ప్లస్ ఎమోషనల్ డ్రామా చేశానని అనుకున్నాడో ఏమో తెలియదు కానీ బాలయ్య తాను ఈ సినిమా చేయబోనని చెప్పేశాడట. ఈ క్రమంలోనే దర్శకుడు సముద్రను ‘చెన్నకేశవరెడ్డి’ ఫిల్మ్ స్టోరి వినాలని కోరాడట.
వీ.వీ.వినాయక్ రచించిన చెన్నకేశవరెడ్డి స్టోరి విన్న తర్వాత ఆ సినిమాకు దర్శకత్వం వహించాలని బాలయ్య సముద్రను కోరారట. కానీ, ఆయన చేయలేకపోయారు. దాంతో ఆ పిక్చర్ కు వీవీ వినాయక్ దర్శకత్వం వహించారు. ఇక ఆ తర్వాత తన వద్ద ఉన్న ‘సింహరాశి’ స్క్రిప్ట్ ను వి.సముద్ర..యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కు వినిపించగా, ఆయనకు నచ్చింది. అలా వీరిరువురి కాంబోలో ‘సింహరాశి’ పిక్చర్ వచ్చి సూపర్ హిట్ అయింది. అలా బాలయ్య నుంచి ఈ సినిమా రాజశేఖర్ వద్దకు వెళ్లిందని చెప్పొచ్చు.