బాలయ్య కూతురికి ఆ హీరో అంటే అంత ఇష్టమా..?

-

నటసింహ నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు ఇప్పుడు నార్త్ లో కూడా అభిమానులను సొంతం చేసుకుంటున్నారు నందమూరి బాలకృష్ణ. ఇక ఈయన కూతురు బ్రాహ్మణి కూడా అందరికీ సుపరిచితురాలే.. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కోడలుగా ఆమె గుర్తింపు సొంతం చేసుకుంది. అంతేకాదు బిజినెస్ ఉమెన్ గా కూడా తనకంటూ ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది బ్రాహ్మణి.

ఇకపోతే ఒకవైపు తండ్రి కుటుంబం సినిమా ఇండస్ట్రీ అయితే ఒకవైపు అత్తగారి కుటుంబం రాజకీయ బ్యాక్ గ్రౌండ్.. ఇలా రెండూ ఉన్నప్పటికీ కూడా రెండు రంగాలలోకి కాకుండా బిజినెస్ వైపు అడుగులు వేస్తూ హెరిటేజ్ సంస్థను ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తూ సక్సెస్ఫుల్ ఉమెన్ గా దూసుకుపోతోంది. ఇకపోతే ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా మారిన బ్రాహ్మణికి సినిమాలు అంటే ఏమాత్రం ఇష్టం లేదట. అందుకే ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారని సమాచారం.

ఇకపోతే హీరోయిన్ రేంజ్ లో ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి ఈమెకు ఇండస్ట్రీలో ఏ హీరో అంటే ఇష్టం అనే విషయం ప్రస్తుతం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. బ్రాహ్మణికి తన తండ్రి సినిమాలంటే ఎక్కువగా ఇష్టమని , ఇక తాతయ్య ఎన్టీఆర్ సినిమాలు అంటే మరీ ఇష్టమని సమాచారం. ఇక తాత సినిమాలన్నా తాతయ్య నటనన్న తనకు చాలా ఇష్టమని ఎన్నో సందర్భాలలో తెరిపింది. ఇక తాత తర్వాత తన తండ్రి అంటే ఇష్టమని.. వీరిద్దరి తర్వాత తనకు బాగా ఇష్టమైన హీరో మెగాస్టార్ చిరంజీవి అని బ్రాహ్మణి వెల్లడించింది. ఇక ఈ విషయం చెప్పడంతో మెగా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version