బండ్ల గణేష్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. ఒకప్పుడు సినిమా ఫంక్షన్ల వేదికలపై మాట్లాడిన స్పీచులు గుర్తుకు వచ్చేవి. ఇప్పుడైతే రాజకీయాల్లోకి మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తాయి. రాజకీయాల్లోకి దిగి.. కోటలు దాటే మాటలతో నవ్వుల పాలయ్యాడు. బండ్ల గణేష్ కాస్తా.. బ్లేడ్ గణేష్ అనే స్థాయికి దిగజారిపోయాడు. అదంతా కాసేపు పక్కకు పెడితే.. టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ నేతలతో కుమ్మక్కు అయ్యాడంటూ త్రివిక్రమ్ పై బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వివరాల్లోకి వెళితే.. బీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేపథ్యంలో ఓ ఫ్యాన్ బండ్ల గణేష్ కు కాల్ చేశాడు. బండ్ల గణేష్ అన్న.. బీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మీరు వెళుతున్నారా అంటూ ఆ అభిమాని ప్రశ్నించారు.
అవును పోతున్నాను.. కానీ త్రివిక్రమ్ గాడు నన్ను వద్దంటూన్నాడట అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు బండ్ల గణేష్. వైసీపీతో కుమ్మక్కు అయి… క్రేజ్ పెంచుకోవాలని త్రివిక్రమ్ చూస్తున్నాడని పేర్కొన్నాడు. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో “బండ్ల గణేష్” అన్న అంటూ అరవండని ఆ ఫ్యాన్ సూచించాడు. అయితే.. దీనికి సంబంధించిన ఓ ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా… మంత్రి గౌతమ్ రెడ్డి మృతి నేపథ్యంలో బీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది.