ముద్రగడ ఇంటి ముందు యువకుడు హల్ చల్ చేశాడు. కాకినాడ జిల్లా కిర్లంపూడి లో మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ నివాసం దగ్గర తెల్లవారుజామున ట్రాక్టర్ తో హడావుడి చేశాడు యువకుడు. ర్యాంపు పై పార్కింగ్ చేసిన కారును ట్రాక్టర్ తో ధ్వంసం చేశాడు యువకుడు. యువకుడు జై జనసేన అంటూ నినాదాలు చేశాడని చెప్తున్నారు అనుచరులు.
ఇక ఈ సంఘటన స్థలానికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ముద్రగడ నివాసానికి చేరుకున్నారు అభిమానులు , పార్టీ కార్యకర్తలు. అటు ఆ యువకుడిపై కేసు కూడా పెట్టారు మాజీ మంత్రి ,వైసీపీ నేత ముద్రగడ. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
https://twitter.com/bigtvtelugu/status/1885930640979415315