నెపోటిజంపై విజయ్ దేవరకొండకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బండ్లన్న.. ట్వీట్ వైరల్..!!

-

సినీ ఇండస్ట్రీలో వారసత్వం గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక చాలామంది కుటుంబ వారసత్వం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి టాలెంట్ ఉండి కొంతమంది దూసుకుపోతుంటే.. మరి కొంతమంది ప్రతిభ లేక వెనకడుగు వేస్తున్నారు. కానీ ఈ నేపథ్యంలోనే సినీ సెలబ్రిటీల వారసులను ఉద్దేశించి విజయ్ దేవరకొండ లైగర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలపై బండ్ల గణేష్ మండిపడ్డారు. ఇక అసలు విషయం ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం లైగర్. ఇక ఆగస్టు 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్న ఈ సినిమాకు సంబంధించి జూలై 21వ తేదీన ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న లైగర్ టీం రకరకాల విషయాలను వెల్లడిస్తూ వైరల్ అవుతూ ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే యూట్యూబ్లో లైగర్ ట్రైలర్ కంటే దాన్ని రిలీజ్ సందర్భంగా విజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. నిజానికి టాలీవుడ్ లో ఎప్పుడు కూడా వారసత్వంపై చర్చ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలకు దానికి ఆర్జం పోసినట్లు అయ్యింది.

ఇక ట్రైలర్ రిలీజ్ కి వెళ్లిన విజయ్ దేవరకొండ అక్కడికి వచ్చిన తన అభిమానులను చూస్తూ.. మీకు మా అయ్య తెల్వదు.. మా తాత తెల్వదు..ఎవడు తెల్వదు.. రెండేళ్ల కాలం అవుతోంది.. నా సినిమా రిలీజ్ అయ్యి.. అంతకుముందు రిలీజ్ అయిన సినిమా పెద్దగా చెప్పుకోదగ్గ సినిమా కూడా కాదు.. అయినా ఈ ట్రైలర్ కి ఈ రచ్చ ఏంది రా నాయనా.. అంటూ విజయ్ దేవరకొండ కామెంట్ చేశాడు. విజయ్ దేవరకొండ వారసత్వం అనే అంశంపై కామెంట్ చేశాడంటూ టాలీవుడ్ లో టాక్ కూడా నడుస్తోంది.

ఇక ఆయన చేసిన వ్యాఖ్యలకు బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చాడు.. ఈ ట్వీట్ చూస్తూ ఉంటే విజయ్ దేవరకొండ వ్యాఖ్యలకు బండ్ల గణేష్ గట్టిగానే సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు టాలెంట్ కూడా ఉండాలంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బండ్ల గణేష్ తన ట్విట్టర్ ద్వారా..” తాతలు, తండ్రులు ఉంటే సరిపోదు. టాలెంట్ కూడా ఉండాలి.. ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్ లా ఉండాలి.. గుర్తుపెట్టుకో బ్రదర్ ” అంటూ విజయ్ దేవరకొండ పేరు కానీ ట్యాగ్ కానీ ఉపయోగించకుండా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ బాగా వైరల్ గా మారుతుంది. అంతేకాదు విజయ్ దేవరకొండను ఉద్దేశించి బండ్ల గణేష్ ఇలా చేశాడనే వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news