లావుగా ఉన్న ప్రతి ఒక్కరు తగ్గాలని అనుకుంటారు. కానీ సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల ఏవేవో చేసి ఉన్న ఆరోగ్యాన్ని ఇంకా పాడుచేసుకుంటారు. తిండి మానేసి చాలా కష్టపడతారు. ఇష్టమైన వాటికి దూరంగా ఉంటూ..కంట్రోల్ చేసుకోలేక నానా అవస్థలు పడతారు. బరువు తగ్గాలంటే..తిండి మానేయక్కర్లేదు.. మార్చేస్తే చాలు. హెల్తీగా టేస్తీగా చేసుకుని తింటూనే క్రమంగా బరువును కంట్రోల్ చేసుకోవచ్చు. బరువును నియంత్రించాలంటే.. ఏ తప్పులు చేయకూడదు, ఏం చేయాలో ఒకసారి చూద్దామా..!
ఈ తప్పులు చేస్తే అస్సలు బరువు తగ్గరు..
నీరు తక్కువగా తాగడం: మన శరీరంలో ఎక్కువ భాగం నీటితో ఉంటుంది. కాబట్టి.. ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉండాలి.అలాగే నీటి ద్వారానే శరీరం నుంచి టాక్సిన్స్ బయటకు వెళ్తాయి. శరీరంలో నీటిశాతం తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఉదయాన్నే లేచిన రెండు గంటలలోపు.. కనీసం లీటర్‌న్నర నీళ్లైనా తాగాలని నియమం పెట్టుకోండి. కొద్ది కొద్దిగా తాగేయొచ్చు.
అల్పాహారం: అల్పాహారం మానేయడం వల్ల బరువు తగ్గుతారు అనుకోవడం పొరపాటే.. టిఫెన్ చేయకపోతే.. శరీరానికి శక్తి లభించదు. దీంతో శరీరం బాగా అలసి పోతుంది. అందుకే తప్పనిసిగా అల్పాహారం తీసుకోవాలి. దీంతో అలసిపోకుండా రోజు చేసే పనిని చేయవచ్చు. టిఫెన్ బాగా ఎక్కువగా తినాలి..భోజం కాస్త తక్కువ తినాలి..రాత్రి ఇంకా తక్కువ తినాలి. ఇలా ఉండాలి తినే పద్దతి. కానీ మనం రివర్స్ ఫాలో అవుతుంటాం..!
రాత్రిపూట తీపి పదార్థాలు తింటారా..: తీపి వంటకాలు బరువు పెరగడానికి కారణమవుతాయి. అయితే.. పగటివేళ కంటే.. రాత్రి సమయంలో చక్కెరతో చేసిన తీపి పదార్థాలను తింటే ఊబకాయం వేగంగా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.. అలాంటి అలవాటుంటే ఈరోజే నుంచే వదిలేయడం మంచిది.
తగినంత నిద్ర: కంటినిండా నిద్రపోతే బాడీ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. నిద్రలేపోతే.. ఊబకాయం పెరగడానికి కారణమవుతంది. ప్రతిఒక్కరూ రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలపాటు నిద్రపోవాలి. నిద్రలేమి బరువు పెరిగే ప్రమాదాన్ని పెంచుతుంది. దీంతోపాటు రోజంతా అలసిపోయేలా చేస్తుంది.
శారీరక శ్రమ: ఇక ఇది మనకు నచ్చని పాయింట్ అయినా.. శారీరక శ్రమ అవసరం. బాడీకి శ్రమ లేకపోవడం కూడా బరువు పెరగడానికి కారణమవుతుంది. బరువు తగ్గాలనుకునే చాలా మంది శారీరక శ్రమపై పెద్దగా శ్రద్ధ చూపరు. కనీసం రోజులో అరగంట పాటైన వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు.