కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. హీరోగా, దర్శకుడిగా, నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్ గా అన్నింట్లో ఆయనకు అనుభవం ఉంది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ.. చాలా బిజీగా గడుపుతున్నాడు విజయ్ ఆంటోనీ. విజయ్ భార్య ఫాతిమా ఆంటోనీ కూడా పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తోంది. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉండి పలు పోస్టులతో నెట్టింట సెన్షేషన్ క్రియేట్ చేస్తోంది.
తాజాగా ఫాతిమా ట్విట్టర్ వేదికగా ఓ సంచలన ట్వీట్ చేసింది. “మీతో బాగానే ఉంటూ మీ వెనుక పెద్ద పెద్ద గోతులు తవ్వే వాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండండి. అది కొత్త వాళ్లైనా.. మీ స్నేహితులైనా అప్పుడప్పుడూ కలిసే వ్యక్తులు అయినా లేదా మీ కుటుంబ సభ్యులు అయినా చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఊరికే చెబుతున్నాను ” అని రాసుకొచ్చింది ఫాతిమా ఆంటోనీ. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.