‘అరబిక్ కుతు’ సంచలనం…4 రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్

-

తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ నటించిన ‘బీస్ట్’ సినిమాలోలని ‘అరబిక్ కుతు’ సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రికార్డ్ వ్యూస్ దక్కించుకుంది. కేవలం 4 రోజుల్లోనే 50 మిలియన్ల మార్క్ దాటింది. 3 మిలియన్లకు పైగా లైక్స్ సాధించింది. ఈ సాంగ్ పెద్ద హిట్ అవ్వడం పట్ల నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఆనందం వ్యక్తం చేస్తోంది. 

విజయ్, పూజా హెగ్డే లీడ్ క్యారెక్టర్లలో వస్తున్న తాాజా సినిమా బీస్ట్. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించాడు. ఈసినిమా నుంచి మొదటగా అరబిక్ కుతు సాంగ్ రిలీజ్ చేశారు. దీంతో ఈ సాంగ్ రికార్డులు వ్యూస్ దక్కించుకుంటుంది. అనిరుధ్, జోనితా గాంధీ ఈ సాంగ్ ను పాడగా… శివ కార్తికేయన్ లిరిక్స్ అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్ తో నెటిజెన్లు రీల్స్ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ కూడా అరబిక్ కుతు సాంగ్ కు రీల్ చేసి అదరగొట్టింది. ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా బీస్ట్ విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version