BEAST : పూజా హెగ్డేతో విజయ్ లాంగ్ జర్నీ..వీడియో వైరల్

-

ఇళయదళపతి విజయ్ నటించిన ‘బీస్ట్’ చిత్రం బుధవారం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే సినిమా జయాపజయాల గురించి ఆలోచించకుండా విజయ్ బీస్ట్ టీమ్‌ని తన రోల్స్ రాయిస్‌లో లాంగ్ డ్రైవ్‌కు తీసుకుని వెళ్లాడు. విజయ్ నే కారు నడుపుతూ సతీష్, పూజా హెగ్డే, నెల్సన్ దిలీప్‌కుమార్, అపర్ణా దాస్ ను డ్రైవ్ కి తీసుకుని వెళ్ళటం విశేషం.

రిలాక్స్ గా లాంగ్ డ్రైవ్ కి వెళ్ళిన టీమ్ కి ‘బీస్ట్’ ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూద్దాం. కాగా ఈ సినిమా విడుద‌లకు ముందే రికార్డుల‌ను తిర‌గ‌రాస్తుంది. ఇటీవ‌ల విడుద‌ల త‌మిళ వ‌ర్షన్ ట్రైల‌ర్ కూడా దూసుకుపోతుంది. కాగా ఈ బీస్ట్ సినిమా నుంచి అర‌బిక్ కుత్తు అనే సాంగ్ ఫిబ్ర‌వ‌రి నెల‌లో విడుద‌ల అయిన విషయం తెలిసిందే. ఆ సాంగ్ కూడా యు ట్యూబు ను షేక్ చేస్తోంది. కాగా ఈ మూవీ 13 వ తేదీన విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news