రజనీకాంత్ చెప్పినందుకే చిరంజీవి శంకర్ దర్శకత్వంలో నటించాలనుకున్నారా ..?

-

సౌత్ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా శంకర్ టాలెంట్ ఏంటో ప్రపంచం అంతా తెలిసిందే. చెప్పాలంటే రాజమౌళి కంటే ముందు సౌత్ లో గొప్ప దర్శకుడిగా క్రెడిబులిటీని సంపాదించుకున్నారు. క్రియోటివ్ థాట్ కి సోషల్ ఇష్యూ ని అడాప్ట్ చేసి కంప్లీట్ కమర్షియల్ సినిమాగా తీర్చి దిద్ది రికార్డ్స్ క్రియోట్ చేశారు. ఆయన తీసిన సినిమాలలో కేవలం రెండు మూడు సినిమాలు మాత్రమే నిరాశపరచాయి. జెంటిల్ మాన్, జీన్స్, ప్రేమికుడు, భారతీయుడు, ఒకే ఒక్కడు, శివాజి, అపరిచితుడు, రోబో, రోబో 2 లాంటి హిస్టరీ క్రియోట్ చేసిన సినిమాలని తెరకెక్కించారు.

 

ప్రస్తుతం కమల్ హాసన్ తో భారతీయుడు 2 ని తెరకెక్కిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి – శంకర్ కాంబినేషన్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమా రాబోతుందని వార్తలు వస్తున్నాయి. చిరంజీవి రీ ఎంట్రీ సినిమా నుంచే ఈ కాంబినేషన్ మీద అప్పుడప్పుడు వార్తలు వస్తున్న సంగతి తెలిసందే. కాని ఇప్పటి వరకు అటు శంకర్ గాని, ఇటు చిరంజీవి గాని సీరియస్ గా ఆలోచించినది లేదనే చెప్పాలి. అయితే వాస్తవంగా గతంలో మాత్రం ఒకటి రెండు సార్లు ఇద్దరి మద్య చర్చలు జరిగినట్టు చెప్పుకున్నారు.

 

అందుకు ముఖ్య కారణం సూపర్ స్టార్ రజనీకాంత్ అని చెప్పాలి. రోబో సినిమా తెలుగు వర్షన్ ప్రమోషన్స్ హైదరాబాద్ లో నిర్వహించినప్పుడు ముఖ్య అథిదిగా మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతు చిరంజీని ప్రత్యేకంగా కోరారు. ఒక్కసారి మూరు శంకర్ దర్శకత్వంలో నటించాలని… మీరేమి చేయక్కర్లేదు అన్ని ఆయనే చేసుకు వెళతారు… జస్ట్ ఆయన చెప్పింది వింటే చాలు అంటూ రిక్వెస్ట్ చేశారు.

అందుకు కారణం కూడా చెప్పారు. మీరు సౌత్ లోనే నంబర్ డాన్సర్. మీలా ఇండస్ట్రీలో ఇంకెవరూ డాన్స్ చేయలేరు. అలాగే మీ అంత గొప్పగా ఎవరూ నటించలేరన్నది నా అభిప్రాయం అంటూ వెల్లడించారు. దాంతో ఇండస్ట్రీ మొత్తం ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందని ఆశించారు. కాని సాధ్యపడలేదు. అందుకే ఇప్పుడు మళ్ళీ టాపిక్ మొదలైంది. అయితే ఇప్పటివరకు కాంబినేషన్ లో సినిమా వస్తుందన్న వార్తలో నిజం లేదని తాజా సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news