ప్రముఖ బెంగాళి నటి ఆత్మహత్య

-

ప్రముఖ బెంగాళీ నటి, సీరియల్ యాక్ట్రెస్ పాయల్ చక్రబోర్తి (38) పశ్చిమబెంగాళ్ సిలిగురిలోని హోటెల్ గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం హోటెల్ లో దిగిన పాయెల్ బుధవారం గ్యాంగ్ టక్ కు వెళ్లాలని చెప్పారట. ఆరోజు రాత్రి కూడా భోజనం ఆర్డర్ చేయలేదని.. ఉదయాన్నే వెళ్లి డోర్ ఎంత కొట్టినా తీయకపోవడంతో బద్ధలు కొట్టి చూస్తే ఆమె ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఉన్నట్టు హోటెల్ సిబ్బంది చూశారట.

వెంటనే హోటెల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వచ్చి జరిగిన సంఘటన గురించి ఆరా తీసి ఆదారాలు సేకరించారట. పాయెల్ ఈమధ్యనే భర్తతో విడిపోవడం జరిగిందట. ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడని సమాచారం. సీరియల్స్, వెబ్ సీరీస్ లతో పాటుగా పలు సినిమాల్లో కూడా పాయెల్ నటించింది. పాయెల్ మృతితో పశ్చిమ బెంగాళ్ సిని పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది.

Read more RELATED
Recommended to you

Latest news