అరవింద సమేత మరో పిక్ లీక్

-

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమా అక్టోబర్ 11న రిలీజ్ ప్లాన్ చేశారు. మరో వారం రోజులు షూటింగ్ చేయాల్సి ఉన్న ఈ సినిమా పూర్తి చేసే దాకా చిత్రయూనిట్ నిద్రాహారాలు మాని మరి చేస్తున్నారట. ఈమధ్య హరికృష్ణ మరణంతో షూటింగ్ కు గ్యాప్ వచ్చింది. అయినా సరే నిర్మాత శ్రేయస్సు కోరి మూడవ రోజే షూటింగ్ మొదలు పెట్టాడు ఎన్.టి.ఆర్.

ఇక ఈ సినిమా మొదలైన నాటి నుండి లీకులు జరుగుతూనే ఉన్నాయి. మొన్నామధ్య ఎన్.టి.ఆర్, నాగేంద్ర బాబు పిక్స్ లీక్ అవగా లేటెస్ట్ గా ఎన్.టి.ఆర్ మరో ఇంటెన్స్ లుక్ లీక్ అయ్యింది. జీప్ లో ఉన్న ఎన్.టి.ఆర్ లుక్ షూటింగ్ స్పాట్ నుండి లీక్ అయ్యింది. మరి లీకులు ఎలా అవుతున్నాయన్నది తెలియదు కాని సినిమాలో ఎన్.టి.ఆర్ లుక్స్ మాత్రం ఫ్యాన్స్ ను ఎక్సైటింగ్ కి గురి చేస్తున్నాయి.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న అరవింద సమేత సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఆడియో సెప్టెంబర్ 22న రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news