నటసింహం నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరిగా థియేటర్లోకి వచ్చేశాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మాస్ అండ్ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ దసరా కానుకగా ఇవాళే థియేటర్లో సందడి చేస్తోంది. ఈ సినిమా మౌత్ టాక్ ప్రస్తుతం బాగానే వినిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ మంచి రివ్యూస్ కనిపిస్తున్నాయి. ఇక థియేటర్ల వద్ద నందమూరి ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు.
అయితే ఇవాళే థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఓటీటీ గురించి అప్పుడే ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌కు క్రేజీ డిమాండ్ ఉందట. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుంది. ఈ సినిమాను థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు అగ్రీమెంట్ చేసుకున్నారట. ఈ సినిమా అక్టోబర్ 19న విడుదలైంది కాబట్టి.. డిసెంబర్ రెండో వారంలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు.
ఇక భగవంత్ కేసరి సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రం తండ్రీ కూతుళ్ల బంధం, మహిళల సంరక్షణ అనే సోషల్ మెసేజ్‌తో రూపొందినట్లు తెలుస్తోంది. ఇందులోజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా.. శ్రీలీల కీలక పాత్రలో బాలయ్య కూతురిగా కనిపించింది. అర్జున్ రాంపాల్ విలన్ రోల్ పోషించారు.