తెలుగు బిగ్ బాస్ వచ్చేస్తున్నాడు….సెప్టెంబర్ 6 నుండే !

-

రియాల్టీ షోలలో కింగ్ అనిపించుకుంటోన్న బిగ్ బాస్ తెలుగులో ఇప్పటికే మూడు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు నాలుగో సీజన్ కు రంగం సిద్ధం అయింది. ఇప్పటికే ఈ షో ఉంటుందని, హోస్ట్ నాగార్జున అని క్లారిటీ అయితే వచ్చేసింది. కానీ ఎప్పుడు మొదలవుతుంది అనే విషయం మీద ఇప్పటిదాకా సస్పెన్స్ ఉండేది, ఆ సస్పెన్స్ ని క్లియర్ చేసేసింది స్టార్ మా. కొద్ది సేపటి క్రితం నాలుగో సీజన్ సెప్టెంబరు 6న ప్రారంభం కానుందని ప్రకటించింది. ఈ కార్యక్రమం ప్రీమియర్ అయ్యేది సెప్టెంబరు 6 నుండే రిమోట్ దగ్గర పెట్టుకోండి అంటూ ఒక ప్రోమో రిలీజ్ చేసింది.

ఇక కరోనా వైరస్ నేపధ్యంలో బిగ్ బాస్ షో కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే దాదాపుగా షోలో పాల్గొనే వారిని, ఒకవేళ ఎవరైనా ఎఫెక్ట్ అయితే వారి బదులుగా మరికొందరిని రెడీ చేసి క్వారంటైన్ లో ఉంచారు. 14 రోజుల పాటు వీరి క్వారంటైన్ పూర్తి అయిన తరువాత మళ్ళీ వారికి కోవిడ్ పరీక్షలు జరిపి కచ్చితంగా నెగెటివ్ ఉన్నవారినే బిగ్ బాస్ హౌస్ లోకి పంపించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ముందు నుండీ నాగార్జున పుట్టిన రోజు తర్వాతి రోజున అంటే ఈ నెల 30 వతేదీన బిగ్ బాస్ షో ప్రారంభం అవుతుందని ప్రచారం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version