బిగ్ బాస్ మొదటి సీజన్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేయగా సెకండ్ సీజన్ నాని హోస్ట్ గా మారాడు. ప్రస్తుతం బిగ్ బాస్ సెకండ్ సీజన్ 60 రోజులకు పైగా పూర్తయ్యింది. ఈసారి బిగ్ బాస్ సెట్ ను కూడా పూణెలో కాకుండా అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేశారు. నాని హోస్ట్ గా ఈ సీజన్ మొదట్లో కాస్త నెగటివ్ టాక్ వచ్చినా ఇప్పుడు ట్రాక్ లోకి వచ్చాడు. టి.ఆర్.పిల లెక్క ఎలా ఉన్నా బిగ్ బాస్ సెకండ్ సీజన్ ఆడియెన్స్ నుండి రెస్పాన్స్ బాగానే ఉంది.
ఇదిలా ఉంటే ఈసారి బిగ్ బాస్ 100రోజులు చేశారు. అంటే మరో నెల పాటు బిగ్ బాస్ వస్తుంది. ఈసారి బిగ్ బాస్ సీజన్ పూర్తి కాగానే మరో సీజన్ మొదలు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారట. హిందిలో బిగ్ బాస్ 11 సీజన్లు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేశాడు. తమిళంలో మొదటి సీజన్ చేసిన కమల్ రెండో సీజన్ చేస్తున్నాడు. కేవలం తెలుగులో మాత్రం ఎన్.టి.ఆర్ మొదటి సీజన్ చేస్తే సెకండ్ సీజన్ నాని చేస్తున్నాడు.
బిగ్ బాస్ ఈ సీజన్ పూర్తి కాగానే నెలలోగానే మరో సీజన్ మొదలు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారట. అందుకే బిగ్ బాస్ 3, 4 సీజన్లకు నానినే హోస్ట్ గా అడుగుతున్నారట. దీని గురించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. అంతేకాదు రాబోయే రెండు సీజన్లు కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే కొనసాగించేలా చూస్తున్నారట. దీనికి గాను నానికి ఫ్యాన్సీ ఎమౌంట్ ఆఫర్ చేస్తున్నారట. మొదటి సీజన్ పూణెలో కాబట్టి ట్రావెలింగ్ కు టైం తీసుకుంది ఇప్పుడు ఎలాగు హైదరాబాద్ లోనే కాబట్టి పెద్దగా టైం పట్టదు. హోస్ట్ గా శని ఆదివారాలే కాబట్టి వారంలో రెండు రోజులు డేట్స్ ఇస్తే చాలు మరి ఈ డీల్ కు నాని ఓకే చెబుతాడా లేడా అన్నది చూడాలి.