BIG BOSS SEASON 6: బిగ్ బాస్ ప్రారంభం.. ఇప్పటివరకు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది వీళ్లే!

-

బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో ” బిగ్ బాస్ సీజన్ 6″. వచ్చేస్తోంది. వివిధ భాషల్లో సూపర్ సక్సెస్ అయిన బిగ్ బాస్.. తెలుగులోనూ టాప్ రేటింగ్ తో సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పటివరకు ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు ఆరో సీజన్ కు సిద్ధమైంది. ఆదివారం సాయంత్రం స్టార్ మా లో అట్టహాసంగా ప్రారంభమైంది బిగ్ బాస్.

హోస్ట్ గా నాగార్జున తనదైన శైలిలో ఎంట్రీ ఇచ్చారు. నాగార్జున ఎంట్రీ లో బంగారు రాజు పాటకు మోడల్స్ తో కలిసి డాన్స్ చేశారు. కాగా బిగ్ బాస్ సీజన్ లో మొట్టమొదటిగా కార్తిక దీపం సీరియల్ నటి కీర్తి బట్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె కార్తీకదీపం సీరియల్ లో హిమ పాత్ర పోషిస్తుంది.

ఇక బిగ్ బాస్ ఇంట్లోకి అందరికంటే మొదట అడుగు పెట్టినప్పుడు ఆమె ఆనందం అంతా ఇంతా కాదు. ఇక రెండో కాంటెస్టెంట్ గా సినీ నటి పింకీ ( సుదీప) ఎంట్రీ ఇచ్చింది. ఆపై 3 కంటెస్టెంట్ గా శ్రీహన్ ఎంట్రీ ఇచ్చాడు. నాలుగో కంటెస్టెంట్ గా ప్రముఖ యాంకర్ నేహా చౌదరి హౌస్ లోకి అడుగుపెట్టింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version