బిగ్​బాస్-7లో ఈ వారం శుభశ్రీ ఎలిమినేట్.. ఐదుగురి వైల్​కార్డ్ ఎంట్రీ

-

బిగ్​బాస్ తెలుగు సీజన్-7 చాలా ఆసక్తికరంగా సాగుతోంది. గత సీజన్​లకు భిన్నంగా.. ఉల్టా పుల్టా అంటూ అంటూ ఐదు వారాల కింద మొదలైంది. ఈ సీజన్ మొదటి వారం నుంచి మహిళలే ఎలిమినేట్ అవుతున్నారు. ఈ వారం కూడా అదే కొనసాగింది. ఈ ఆదివారం శుభశ్రీ ఎలిమినేట్ అయింది. అయితే శుభశ్రీతో పాటు గౌతమ్‌ కృష్ణల డబుల్‌ ఎలిమినేషన్‌తో షాకిచ్చాడు. ఆ కాసేపటికే గౌతమ్‌ కృష్ణను సీక్రెట్‌ రూమ్‌ను పంపి, మరో ట్విస్ట్‌ ఇచ్చాడు. అంతేకాదు ఇంకో అదిరిపోయే ట్విస్ట్ కూడా ఇచ్చాడు బిగ్​బాస్. బిగ్​బాస్ సీజన్‌-7 ‘2.0’ షురూ చేశాడు.

ఈ ఆదివారం రోజున ఏకంగా ఐదుగురు కొత్త కంటెస్టెంట్లను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్​లోకి పంపాడు. ఈ ఐదుగురిలో అంబటి అర్జున్‌, అశ్వినీ శ్రీ, భోలే షావలి , పూజా మూర్తి , నయని పావనిలు హౌస్‌లోకి అడుగు పెట్టారు. ఈ వీకెండ్‌ ఎపిసోడ్‌కి ‘చిన్నా’ ప్రమోషన్స్‌లో భాగంగా సిద్ధార్థ్‌, ‘టైగర్‌ నాగేశ్వరరావు’ ప్రమోషన్స్‌లో భాగంగా ఆ సినిమా హీరోయిన్స్‌తో కలిసి రవితేజ వచ్చి బిగ్‌బాస్‌ వేదికపై సందడి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news