PSPK26 పవన్ ఫాన్స్ కి బిగ్ న్యూస్…!

-

రాజకీయాలతో పాటుగా సినిమాల్లో కూడా బిజీ అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాస్త దూకుడుగా సినిమాలు చేస్తున్నారు. వరుసగా సినిమాలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ముందుకి వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పింక్ రీమేక్ సినిమా చేస్తున్న ఆయన, త్వరలోనే క్రిష్ సినిమాలో నటించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా క్రిష్ పూర్తి చేసుకున్నాడు.

ఆ తర్వాత మరో సినిమాను లైన్లో పెట్టారు పవన్ కళ్యాణ్. తనకు గబ్బర్ సింగ్ తో మంచి హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ తో సినిమాకు ఓకే చెప్పారు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి పింక్ చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా టైటిల్ గురించి ఇప్పటికే ఫాన్స్ లో ఎంతో ఆసక్తి ఉంది. వకీల్ సాబ్ అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. మార్చ్ రెండో తేదీన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ ను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్దమవుతుంది. అదే రోజు టైటిల్‌ ను కూడా చిత్ర యూనిట్ ప్రకటిస్తుంది. ఇక అదే వారంలో మార్చ్ 8న మహిళా దినోత్సవం సందర్భంగా సినిమాలోని తొలి పాటను కూడా విడుదల చేస్తారని ప్రకటించింది. దీనితో ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news